లఖ్‌నవూ: పెళ్లి చేసుకున్న జంటలకు బహుమతులు ఇవ్వడం సాధారణమే. అయితే బంగరామో, ఇంటి అవసరాలకు వచ్చే వస్తువులో, ఇతర వస్తువులో ఇస్తుంటారు. కానీ యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఒక సమూహిక వివాహంలో పెళ్లి చేసుకున్న జంటలకు బుల్డోజర్లను బహుమతిగా ఇచ్చారు. చౌరాసియా సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహంలో జరిగింది ఇది.
ఇవి కూడా చదవండి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలన నచ్చి పెళ్లి జంటలకు బుల్డోజర్లు ఇచ్చినట్లు చౌరాసియా సమాజ్ ప్రతినిధులు తెలిపారు. యోగి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉందని అందుకే సింబాలిక్‌గా అవి ఇచ్చామని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల ముందు ప్రచారంలో ‘బాబా బుల్డోజర్’గా యోగిపై ప్రచారం జరిగింది. నేరాలకు పాల్పడే వారిపై, మాఫియాపై యోగి ప్రభుత్వం బుల్డోజర్లు ఎక్కిస్తుందని బీజేపీ ప్రచారం చేసింది.
ఇవి కూడా చదవండి
అయితే పెళ్లిలో ఇలాంటి బహుమతులు ఇవ్వడం ఇది కొత్త కాదు. గతంలో ఒకసారి నిర్వహించిన సామూహిక వివాహంలో పెళ్లి చేసుకున్న జంటలకు టాయిలెట్ సీట్లను బహుమతిగా ఇచ్చారు. ప్రధానమంత్రి స్వచ్ఛభారత్ కార్యక్రమం తమను బాగా ప్రభావితం చేసిందని, దాన్ని మరింత విస్తృతం చేయడంలో తమ వంతు కృషి ఉండాలనే టాయిలెట్ సీట్లను బహుమతిగా ఇచ్చినట్లు అప్పటి సామూహిక వివాహ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి