హైదరాబాద్ సిటీ/కూకట్పల్లి : ఇంట్లోని బాత్రూం శుభ్రంగా ఉంచలేదన్న విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదంలో గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొంది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ శంకర్ వివరాలు తెలిపారు. గుంటూరుకు చెందిన దాసరి శృతి(28), నవీన్ దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరు కూకట్పల్లి న్యూ బాలాజీనగర్లో నివాసముంటున్నారు. వీరికి ఆరేళ్లు, ఏడాదిన్నర వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. గత మంగళవారం సాయంత్రం డ్యూటీనుంచి ఇంటికి వచ్చిన నవీన్ బాత్రూంలో మూత్రవిసర్జనకు వెళ్లి నీళ్లు సరిగ్గా పోయలేదు.
ఇదే విషయమై శృతి భర్తను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోని గదిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలానికి చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి