రూ.43కోట్ల భవనంలో పెళ్లికి ఓ జంట పక్కాప్లాన్.. పోలీసుల రంగ ప్రవేశంతో చవరికి!

ABN , First Publish Date - 2021-04-23T17:38:25+05:30 IST

సాధారణంగా ఎవరైనా తమ పెళ్లి చిరకాలం గుర్తుండిపోయేలా.. అంగరంగవైభవంగా చేసుకోవాలని కలలు కంటారు. అందుకోసం భారీ ఖర్చు చేసి హడావిడి చేస్తుంటారు. ఫ్లోరిడాకు చెందిన ఓ జంట కూడా ఇ

రూ.43కోట్ల భవనంలో పెళ్లికి ఓ జంట పక్కాప్లాన్.. పోలీసుల రంగ ప్రవేశంతో చవరికి!

వాషింగ్టన్: సాధారణంగా ఎవరైనా తమ పెళ్లి చిరకాలం గుర్తుండిపోయేలా.. అంగరంగవైభవంగా చేసుకోవాలని కలలు కంటారు. అందుకోసం భారీ ఖర్చు చేసి హడావిడి చేస్తుంటారు. ఫ్లోరిడాకు చెందిన ఓ జంట కూడా ఇలానే ఆలోచించింది. అయితే అందుకు ఎక్కవ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి ఆ జంట ఇష్టపడలేదు. ఈ క్రమంలో భారీ స్కెచ్ వేశారు. కానీ వారి ప్లాన్ ఫెయిల్ అయింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫ్లోరిడాకు చెందిన విల్సన్, షెనితా జోన్స్.. అందరూ నోళ్లు వెళ్లబెట్టేలా వివాహం చేసుకోవాలని ఆశపడ్డారు. సరిగ్గా అదే సమయంలో మియామి ప్రాంతంలో స్విమ్మింగ్‌ఫూల్, టెన్నీస్ కోర్టు, తొమ్మిది బెడ్‌రూంలు, 15 బాత్‌రూంలు ఉన్న దాదాపు రూ.43కోట్లు విలువ చేసే భారీ భవంతి వారి కంటపడింది. అది అమ్మకానినకుందని గ్రహించి.. వారి పెళ్లికి ఓ చక్కని వేదిక దొరికిందని ఆ జంట భావించింది. 


ఈ క్రమంలోనే అద్భుతమైన ప్లాన్‌ను వేసింది. దాన్ని అమలు పరచడంలో భాగంగా విల్సన్ పలుమార్లు ఆ భవంతిని సందర్శించాడు. కొనుగోలు చేయడానికి వచ్చినట్టు ప్రవర్తిస్తూనే.. ఫొటోలు దిగి హల్‌చల్ చేశాడు. ఖరీదైన భవనంలో ఎవరైనా నివసిస్తున్నారా? అనే కోణంలో వాకబు చేసి, చివరికి అందులో ఎవరూ ఉండటం లేదనే నిర్ణయానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో విల్సన్, షెనితా జోన్స్.. రాయల్ కపుల్‌ భవనంలోకి ఎంట్రీ ఇచ్చారు. కాక్‌టైల్ పార్టీ, విందు వినాదాలతో హడావిడి చేశారు. ఈ తరుణంలోనే అదే భవంతిలోని ఓ గదిలో నివసిస్తున్న ఇంటి యజమాని నాథన్ ఫింకిల్ దీన్ని గమనించాడు. వెంటనే తన ఇంటి ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని విల్సన్, షెనితా జోన్స్‌లను ఆదేశించాడు. అయితే దానికి వారు నిరాకరించారు. దీంతో నాథన్ ఫింకిల్.. పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, విల్సన్, షెనితాలను ఆ భవంతి నుంచి ఖాళీ చేయించి బయటకు పంపించారు. కాగా.. దీనిపై స్పందించిన పోలీసులు.. భవనంలో ఎవరూ నివసించడంలేదని ఉద్దేశంతోనే ఆ జంట ఈ సాహసం చేసినట్టు వివరించారు. 


Updated Date - 2021-04-23T17:38:25+05:30 IST