Abn logo
Sep 22 2021 @ 01:56AM

Mask ఉందని రెస్టారెంట్‌ నుంచి వెళ్లగొట్టారు!

న్యూయార్క్‌, సెప్టెంబరు 21: మాస్కు ధరించారనే కారణంతో ఓ దంపతులను రెస్టారెంట్‌ నుంచి నిర్వాహకులు వెళ్లగొట్టారు. కరోనా నిబంధనల పట్ల నిక్కచ్చిగా ఉండే అమెరికాలో ఈ ఘటన జరగడం విశేషం. సెప్టెంబరు 11న టెక్సా్‌సకు చెందిన భార్యాభర్తలు తమ 4 నెలల వయసున్న బిడ్డను ఎత్తుకొని రౌలెట్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ప్రవేశద్వారం వద్దే వెయిట్రెస్‌ వారిని నిలువరించి మాస్కులు తొలగించి లోపలికి రావాలని చెప్పారు. అయితే మ్యూజిక్‌ హోరులో ఆమె మాటలు వారికి వినిపించలేదు. బహు శా మాస్కుతో ముఖాలు తెలియడం లేదనే కారణంతో ఐడీ కార్డులు అడుగుతోందో ఏమో అనుకొని పర్సులోంచి తీసి వాటిని ఆమెకు చూపించారు. అనంతరం లోపలికి వెళ్లి టేబుల్‌ వద్ద కూర్చుని డ్రింక్స్‌ అర్డర్‌ చేశారు. 

కొద్దిసేపటికి అదే వెయిట్రెస్‌ అక్కడికొచ్చి మాస్కులు తీసేయాలని కాస్త గట్టిగా చెప్పడంతో ఆ దంపతులు షాక్‌ అయ్యారు. తమ బిడ్డకు వ్యాక్సినేషన్‌ చేయించలేదని, అందుకే తాము మాస్కులు ధరించామని వారు చెప్పినా ఆమె వినిపించుకోలేదు. రెస్టారెంట్‌లోకి మాస్కులు ధరించిన వారిని అనుమతించొద్దని నిర్ణయించామని, ‘మాస్కులైనా తీసేయండి. లేదా రెస్టారెంట్‌ నుంచి వెళ్లిపోండి’ అని గట్టిగా చెప్పడంతో ఆ దంపతులు, రెస్టారెంట్‌ నుంచి బయటకు రాక తప్పలేదు.

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...