ఇంట్లో నుంచి బయటకు చూస్తే.. మృతదేహాలే.. న్యూయార్క్‌లో..

ABN , First Publish Date - 2020-04-09T22:22:55+05:30 IST

అమెరికాలో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. ముఖ్యంగా న్యూయార్క్ నగరం శవాల దిబ్బగా మారింది. తమ ఇంట్లో నుంచి

ఇంట్లో నుంచి బయటకు చూస్తే.. మృతదేహాలే.. న్యూయార్క్‌లో..

న్యూయార్క్: అమెరికాలో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. ముఖ్యంగా న్యూయార్క్ నగరం శవాల దిబ్బగా మారింది. తమ ఇంట్లో నుంచి బయటకు చూడాలన్నా ఆందోళన కలుగుతోందంటూ న్యూయార్క్‌కు చెందిన ఓ జంట ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో ఆసుపత్రులు సరిపోక సెంట్రల్ పార్క్, స్థానికంగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటుచేశారు. స్థానికులకు ఈ ఆసుపత్రుల దగ్గర శవాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. న్యూయార్క్‌లో ఉంటే తమ పరిస్థితి కూడా అలానే మారుతుందేమోనని అనేక మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. అలిక్స్, బుష్‌విక్ అనే జంట తమ కిటికీలోంచి బయటకు చూస్తే.. శవాలే కనిపిస్తున్నాయని తెలిపారు. మృతదేహాలను లెక్కపెట్టడం కూడా మానేశామంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తమ ఇంటి బయటి దృశ్యాలు, శబ్దాల కారణంగా ఇంటి లోపల కూడా మనశ్శాంతిగా జీవించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, న్యూయార్క్ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,51,171 మంది కరోనా బారిన పడగా.. 6,268 మంది మృతిచెందారు.

Updated Date - 2020-04-09T22:22:55+05:30 IST