Viral News: అదృష్టం అంటే ఈ దంపతులదే.. గోడ కూల్చితే ఎవరికైనా ఇలా జరుగుతుందా..!

ABN , First Publish Date - 2022-09-05T00:37:53+05:30 IST

ఆ దంపతులు దాదాపు 10ఏళ్లుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇల్లుకు మరమ్మత్తులు చేయాలని భావించారు. ఇందులో భాగంగానే వంటింట్లో ఉన్న ఓ గోడను కూల్చారు. ఈ పని వాళ్ల జీవితాలనే మా

Viral News: అదృష్టం అంటే ఈ దంపతులదే.. గోడ కూల్చితే ఎవరికైనా ఇలా జరుగుతుందా..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ దంపతులు దాదాపు 10ఏళ్లుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇల్లుకు మరమ్మత్తులు చేయాలని భావించారు. ఇందులో భాగంగానే వంటింట్లో ఉన్న ఓ గోడను కూల్చారు. ఈ పని వాళ్ల జీవితాలనే మార్చేసింది. కోట్లాది రూపాయలను అందించింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



బ్రిటన్‌(UK)కు చెందిన దంపతులు గత పదేళ్లుగా నార్త్ యార్క్‌షైర్ ( North Yorkshire) ప్రాంతంలోని ఓ ఇంట్లో కాపురం చేస్తున్నారు. ఏళ్లు గడవటంతో ఆ ఇల్లు ప్రస్తుతం పాతదైపోయింది. ఈ క్రమంలోనే ఆ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వంట గదిని కూల్చేసి.. సకల సౌకర్యాలతో తిరిగి నిర్మించాలని భావించారు. ఈ నేపథ్యంలోనే కూల్చివేతను ప్రారంభించారు. గదిలోని ఓ గోడను బద్దలు కొడుతున్న సమయంలో కోట్ల విలువ చేసే బంగారు నాణేలతో కూడిన నిధి బయటపడింది. అది చూసి ఆ భార్యభర్తలు షాకయ్యారు. సుమారు 400ఏళ్లనాటి 264 బంగారు నాణేలను గుర్తించి తొలుత కంగుతిన్నారు. ఆ తర్వాత పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేశారు. ఈ బంగారు నాణేలను వేలం ద్వారా విక్రయించాలని ఆ దంపతులు భావిస్తున్నారు. వాటిని విక్రయించడం ద్వారా సుమారు రూ.2.3 కోట్ల రూపాయలు పొందొచ్చని లెక్కలు వేస్తున్నారు. కాగా.. ఇంటి గోడలో నిధి బయటపడ్డ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2022-09-05T00:37:53+05:30 IST