పిల్లి అని పెంచుకుందామనుకుంటే.. అది కాస్తా..

ABN , First Publish Date - 2020-10-12T21:10:24+05:30 IST

పెంపుడు జంతువులను పెంచుకోవడం అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ కుక్కలు, పిల్లులను పెంచుకునేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు. వారిలో కొందరు పెంపుడు జంతువులను కొనుగోలు చేసి తెచ్చుకుని..

పిల్లి అని పెంచుకుందామనుకుంటే.. అది కాస్తా..

ప్యారిస్‌: పెంపుడు జంతువులను పెంచుకోవడం అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ కుక్కలు, పిల్లులను పెంచుకునేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు. వారిలో కొందరు పెంపుడు జంతువులను కొనుగోలు చేసి తెచ్చుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటుంటారు. ఫ్రాన్స్‌లోని ఓ జంట కూడా అలానే ఓ పిల్లిని అలాగే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. పిల్లి అందంగా ఉండడంతో ప్రతిరోజూ దానితో ముద్దులాడడం, ఆడుకోవడం.. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అది కూడా వారితో కలిసిపోయి ఆడుతుండేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పిల్లిలో విచిత్రమైన మార్పులు రావడం మొదలయ్యాయి. దాంతో అసలు విషయం తెలిసి ఆ జంట షాక్‌ తింది. తాము తెచ్చుకున్నది పిల్లి కాదు.. పులి అని తెలియడంతో బెంబేలెత్తిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై విచారణ జరిపి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.


నార్మండీకి చెందిన లా, హవ్రే దంపతులు 2ఏళ్ల క్రితం సవానా జాతికి చెందిన పిల్లిని ఆన్‌లైన్ ప్రకటన చూశారు. వెంటనే వారిని సంప్రధించి రూ. 6 లక్షలు ( 6000 యూరోల)కు కొనుక్కున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో అపురూపంగా చూసుకున్నారు. ఇలా వారం గడిచిన తర్వాత అసలు విషయం బయటపడింది. తాము తెచ్చుకున్నది. మూడు నెలల పులి పిల్ల అని తెలుసుకొని భయపడిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. మొదట లా, హవ్రేలపైనే పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే రెండేళ్ల సుధీర్ఘ విచారణ తర్వాత తొమ్మిది మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. లా, హవ్రేలను నిర్ధోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తరువాత ఆ పులిని ఓ జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు.

Updated Date - 2020-10-12T21:10:24+05:30 IST