ప్రభుత్వరంగ సంస్థలతో దేశాభివృద్ధి

ABN , First Publish Date - 2022-01-23T06:18:39+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణతో దేశాభివృద్ధ్ది జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 345వ రోజు కొనసాగాయి.

ప్రభుత్వరంగ సంస్థలతో దేశాభివృద్ధి
రిలే దీక్షల శిబిరంలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు

కూర్మన్నపాలెం, జనవరి 22: ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణతో దేశాభివృద్ధ్ది జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు  345వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో సింటర్‌ప్లాంట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వెంకటరావు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలను కార్మికులు తిప్పికొట్టాలన్నారు.  పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలన్నారు. ీ ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మూర్తి, సత్యనారాయణ, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, జి.ఆనంద్‌, నారాయణరావు, లక్ష్మణ్‌, ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T06:18:39+05:30 IST