పట్టాలెక్కనున్న విద్యుత్‌ రైలు

ABN , First Publish Date - 2021-03-06T05:30:00+05:30 IST

చుక్‌ చుక్‌ బండి విషయంలో ప్రగతి పరుగులపై జగిత్యాల జిల్లా వాసులు ఆశలతో ఎదురుచూస్తు న్నారు. జగిత్యాల జిల్లాలో రైల్వేలైన్‌ విద్యుద్ధీకరణ పనులు వందశాతం పూర్తయ్యాయి.

పట్టాలెక్కనున్న విద్యుత్‌ రైలు

లింగంపేట - మోర్తాడ్‌ వరకు పనులు పూర్తి  

ట్రయల్‌ రన్‌ నిర్వహించిన అధికారులు

నిజామాబాద్‌ వరకు పనులు పూర్తయితే పెరగనున్న రైళ్ల రాకపోకలు

జగిత్యాల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : చుక్‌ చుక్‌ బండి విషయంలో ప్రగతి పరుగులపై జగిత్యాల జిల్లా వాసులు ఆశలతో ఎదురుచూస్తు న్నారు. జగిత్యాల జిల్లాలో రైల్వేలైన్‌ విద్యుద్ధీకరణ పనులు వందశాతం పూర్తయ్యాయి. రైల్వే అధికారులు రెండు రోజులుగా ట్రయల్‌ రన్‌లను సైతం విజయవంతంగా పూర్తి చేశారు. పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లై న్‌ విద్యుద్ధీకరణ కోసం 2017-18 రైల్వే బడ్జెట్‌లో కేటాయించిన రూ. 97 కోట్ల నిధులతో సుమారు 95కిలో మీటర్ల దూరం పనులను గత ఏడా ది పూర్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలోని లింగంపేట రైల్వే స్టేషన్‌ నుంచి నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ వరకు రైల్వేలైన్‌ విద్యుద్ధీకరణ పూర్తి కా వడంతో ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు.  


నెలాఖరులోపు విద్యుత్‌ ఇంజన్‌ రైళ్ల రాకపోకలు..

పనులు పూర్తయిన పెద్దపల్లి - మోర్తాడ్‌ రైల్వే మార్గంలో ఈనెలాఖ రు వరకు విద్యుత్‌ ఇంజన్లు గల రైళ్లను నడపడానికి అధికారులు నిర్ణ యం తీసుకున్నారు. మోర్తాడ్‌ నుంచి నిజామాబాద్‌ వరకు 45 కిలో మీ టర్ల రైల్వే మార్గాన్ని ఈ యేడాది చివరికల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో  అధికారులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి నుంచి మోర్తాడ్‌ వరకు 133 కిలో మీటర్ల దూరం వరకు పనులు పూర్తి చేశారు. 


మరికొన్ని రైళ్లు నడిచే అవకాశాలు...

పెద్దపల్లి-నిజామాబాద్‌ మార్గం పనులు పూర్తయితే మరికొన్ని ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు, సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు ఈ మార్గంలో నడిచే వీలుంటుంది. కా జీపేట- సికింద్రాబాద్‌-నిజామాబాద్‌ మార్గంలో నడిచే పలు రైళ్లను కూ డా వయా కాజిపేట- పెద్దపల్లి-నిజామాబాద్‌ మీదుగా దారిమళ్లించే అ వకాశాలున్నాయి. తద్వారా జగిత్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్ద పల్లి జిల్లాల ప్రజలకు మరికొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చే వీలుం టుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల నుంచి ముంబాయికి సైతం రైలు మార్గంలో వెళ్లడానికి అవకాశాలుంటాయి. కాగా కొవిడ్‌ కం టే ముందు నడిచిన కాచిగూడ నుంచి కరీంనగర్‌ వయా నిజామాబా ద్‌ ప్యాసింజరు, నిజామాబాద్‌ నుంచి సిర్పూర్‌టౌన్‌ మద్య నడిచే ఫుష్‌ పుల్‌ రైలు, లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ నుంచి కరీంనగర్‌ వరకు నడిచే వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను ఇంకా పునరుద్ధరించలేదు. ప్రస్తుతం పెద్దపల్లి నుంచి కరీంనగర్‌ వరకు కేవలం తిరుపతి నుంచి కరీంనగర్‌ బై వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మాత్రమే నడుస్తోంది. ప్రస్తుతం నడిచే పుష్‌ఫుల్‌ రైళు మరింత సమర్థవంతంగా నడిచే అవకాశాలున్నాయి. ప్ర స్తుతం పెద్దపల్లి నుంచి నిజామాబాద్‌ రైల్వే మార్గంలో ప్యాసింజర్‌ రైళ్లు పూర్తి స్థాయిలో నడవడం లేదు. తిరుపతి నుంచి కరీంనగర్‌ వరకు నడుస్తున్న రైలును నిజామాబాద్‌ వరకు పొడగించే అవకాశాలు సై తం ఉన్నాయి. పెద్దపల్లి నుంచి నిజామాబాద్‌ రైల్వే మార్గంలో రైళ్ల వేగ పరిమితిని గంటకు 110 కిలో మీటర్ల పెంచాలన్న లక్ష్యంతో ఇంజన్‌ల తో ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో జిల్లా వాసులకు రైలు వసతులపై మరిన్ని ఆశలు చిగురిస్తున్నాయి. 


Updated Date - 2021-03-06T05:30:00+05:30 IST