రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం: నిమ్మగడ్డ

ABN , First Publish Date - 2021-03-14T02:30:23+05:30 IST

ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తెలిపారు.

రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం: నిమ్మగడ్డ

విజయవాడ: ఆదివారం ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం వీడియో, సీసీ కెమెరాలు, వెబ్‌ కాస్టింగ్‌ల ద్వారా రికార్డు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్‌ రాత్రివరకు కొనసాగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగిల్‌ డిజిట్‌ మార్జిన్‌ ఉన్నప్పుడు మాత్రమే రీ కౌంటింగ్‌కు అనుమతించాలని, సకాలంలో మీడియాకు కౌంటింగ్‌ వివరాలు అందజేయాలని రమేష్‌కుమార్ ఆదేశించారు.


ఈ నెల 10న  పురపాలక ఎన్నికలు జరిగాయి. ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,214 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 38,25,129 మంది కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 39,46,952. ట్రాన్స్‌జెండర్లు 1150 మంది ఉన్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Read more