Abn logo
Sep 19 2021 @ 00:57AM

ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు

మునగపాకలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌


 జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున

మునగపాక/అచ్యుతాపురం, సెప్టెంబరు 18:  ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. మునగపాకలో ఓట్ల లెక్కింపు జరిగే రాహుల్‌ కల్యాణ మండపంలో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లాలో 793 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రి ల్‌లో ఎన్నికలు జరిగాయన్నారు. కోర్టు తీర్పు మేరకు ఆదివారం లెక్కింపు చేపడుతున్నట్టు చెప్పారు ఆయన వెంట ఆర్డీవో సీతారామారావు, మండల ఎన్నికల ప్రత్యేకాధికారి యతిరాజులు, ఎంపీ డీవో ఉద యశ్రీ ఉన్నారు. అలాగే, అచ్యుతాపుం జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటైన కౌంటింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్‌ జరపాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కడ చదువుతున్న విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. వారితో కలిసి భోజనం కూడా చేశారు.  తహసీల్దార్‌ రాంబాయి, ఎంపీడీవో కృష్ణ పాల్గొన్నారు.