Abn logo
Sep 19 2021 @ 00:24AM

పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ఏర్పాట్లపై ఆరా తీస్తున్న జేసీ సిరి

- పరిశీలించిన జేసీ సిరి, ఎస్పీ ఫక్కీరప్ప

ధర్మవరంరూరల్‌, సెప్టెంబరు 18: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్లు లెక్కింపునకు ధర్మవరంలో కౌంటింగ్‌ కేంద్రాల లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.  పట్టణంలోని బీఎస్సాఆర్‌ బాలు ర, బాలికల పాఠశాల, గర్ల్స్‌హైస్కూల్‌ పాఠశాలలో కౌంటింగ్‌ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ధర్మవరం మండలం, ముదిగుబ్బ మండలాలు బీఎస్సాఆర్‌ బాలుర పాఠశాలలో, బత్తలపల్లి, తాడిమర్రి మండలాలు బీఎస్సాఆర్‌ బాలికల పాఠశాలలో, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, చెన్నే కొత్తపల్లి మండలాలకు సంబంధించి కళాజ్యోతి సర్కిల్‌లో ఉన్న జిల్లా పరిషత్‌గర్ల్స్‌ హైస్కూల్‌లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఆయా కేంద్రాలలో కౌంటింగ్‌ సామగ్రిని అధికారులు ఏర్పాట్లు చేసి సిద్ధం చేశారు. ఈ కౌంటింగ్‌ కేంద్రాలను శని వారం జాయింట్‌ కలెక్టర్‌ సిరి, ఎస్పీ ఫక్కీరప్పలు పరిశీలిం చారు. ముందుగా జాయింట్‌కలెక్టర్‌ సిరి కౌంటింగ్‌ కేంద్రాల లోని సామగ్రిని పరిశీలించారు. ఒక్కొక్క గదిలో ఎన్ని ఎంపీ టీసీ స్థానాలు లెక్కింపునకు ఏర్పాట్లు చేశారని, ఎంతమంది సిబ్బందిని నియమించారని, గదుల్లో విద్యుత్‌సౌకర్యం తదితర ఏర్పాట్లుపై ఆర్డీఓ రవీంద్రని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా పొరపాట్లుకు తావివ్వకుండా అప్రమత్తం గా ఉండాలని సిబ్బం దిని ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కోసం అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తిచేశామని జేసీ తెలిపా రు. అదేవిధంగా జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లుపై సమీక్షించారు. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తియ్యేంత వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీంద్ర, డీఎస్పీ రమా కాంత్‌, ఆర్‌ఓ క్రిష్ణయ్య, ఎంపీడీఓలు పాల్గొన్నారు.