కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-09-18T05:37:28+05:30 IST

రాజమహేంద్రవరం డివిజన్‌లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఈనెల 19న బొమ్మూరులోని నేక్‌ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
కౌంటింగ్‌ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా

  • రేపు ఉదయం 8గంటల నుంచే ఓట్ల లెక్కింపు
  • బొమ్మూరు నేక్‌లో రాజమహేంద్రవరం డివిజన్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం డివిజన్‌లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఈనెల 19న బొమ్మూరులోని నేక్‌ కార్యాలయంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని సబ్‌-కలెక్టర్‌ ఇలాక్కియా రిటర్నింగ్‌, అసి స్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్‌-కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం సా యంకాలం ఆమె సమీక్ష చేశారు. ఆరోజు ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. స్ర్టాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ కేంద్రాల వరకూ బారికేడింగ్‌ ఏర్పాటుచేయాలని, సీసీ కెమేరాలు కూడా ఏర్పాటు చేసి, వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించాలన్నారు. విధులు నిర్వహించే వారికి అన్ని వివరాలు తెలియాలని, ట్రేలమీద అభ్యర్ధుల వివరాలు తెలిసేలా స్టిక్కర్లు అతి కించాలన్నారు. కరోనా లక్షణాలు న్న అభ్యర్థులు, వారి ఏజెంట్లకు కౌంటింగ్‌కు అనుమతి లేదన్నారు.  ఆ రోజు విద్యుత్‌ సరఫరాకు అంత రాయం లేకుండా ఆశాఖ అధికార్లు చూసుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుం డా ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. సమావేశంలో  భూగర్భశాఖ  డీడీ విజయకుమార్‌, డీఎల్పీవో జె.సత్యనారాయణ, ఎంపీడీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T05:37:28+05:30 IST