కౌంటింగ్‌ ఏర్పాట్లను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-09T06:36:30+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌, కౌంటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ జరగాలన్నారు.

కౌంటింగ్‌ ఏర్పాట్లను పూర్తి చేయాలి
ఉట్నూర్‌లో పోలింగ్‌ స్టేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోయల్‌
ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 8: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌, కౌంటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ జరగాలన్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌ వీడియోగ్రఫి, వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించాలని, మొబైల్‌ఫోన్లు, కెమెరాలకు పోలింగ్‌ కేంద్రాలకు, కౌంటింగ్‌ కేంద్రాలకు అనుమతి లేదని తెలిపారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు ఎన్నికల కమిషన్‌ అనుమతించిన గుర్తింపు కార్డులను వెంట తీసుకురావాలన్నారు. ఇందులో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ రాజేష్‌చంద్ర, అదనపు కలెక్టర్‌ నటరాజ్‌, ఆర్డీవో రాజేశ్వర్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, కలెక్టరేట్‌ పర్యవేక్షకుడు వర్ణ, రాజేశ్వర్‌, ఆదిలాబాద్‌ పట్టణ తహసీల్దార్‌ భోజన్న, సాంకేతిక సిబ్బంది ఉమాకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్‌ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్‌
ఈనెల 10న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని పోలింగ్‌ కేంద్రంను, టీటీడీసీలోని పోలింగ్‌ మెటేరియల్‌ డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్‌, రిసెప్షన్‌ కేంద్రాలలోని ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, పోలింగ్‌ నిర్వాహణకు కావాల్సిన తాగునీరు, ఫర్నిచర్‌, ఇతర వసతులను ఏర్పా ట్లు చేసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆర్డీవో రాజేశ్వర్‌, జిల్లా పరిషత్‌ సీఈవో గణపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్‌ రాథోడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, మాస్టర్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌, ఆదిలాబాద్‌ తహసీల్దార్‌ భోజన్న, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెలాఖరుకు వంద శాతం పూర్తి చేయాలి
ఉట్నూర్‌: జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో రాత్రిపూట కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ నెలాఖరు నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమావేశ మందిరంలో ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, గాదిగూడ మండలాల మెడికల్‌ ఆఫీసర్లు, తహసీల్దార్లు, మండలాభివృద్ది అధికారులు, తదితరులతో వ్యాక్సినేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
అలాగే, శుక్రవారం జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను  కలెక్టర్‌ ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి పరిశీలించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, గాదిగూడ మండలాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

Updated Date - 2021-12-09T06:36:30+05:30 IST