కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-04-17T05:13:22+05:30 IST

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
మాస్కులు పంపిణీ చేస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 16: కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. శుక్రవారం ఓర్వకల్లులోని ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో మాస్కులు లేకుండా వెళ్తున్న ప్రజలు, ప్రయాణికులకు మాస్కులు పంపిణీ చేసి.. కరోనా నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. లేనిచో పోలీసులు జరిమానా విధిస్తారని హెచ్చరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్‌ ఎన్నికల్లో బాగా పని చేసిన పోలీసులకు ప్రశంసాపత్రాలు, పోలీసు స్టేషన్‌ ఆవరణంలో పంపిణీ చేసి వారిని అభినందించారు. అనంతరం పోలీసులకు కరోనాపై పలు సూచనలు సలహాలిచ్చారు. కార్యక్రమంలో కర్నూలు రూరల్‌ సీఐ శ్రీనాథ్‌ రెడ్డి, ఓర్వకల్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:13:22+05:30 IST