గన్‌ లైసెన్సుదారులకు కౌన్సిలింగ్‌

ABN , First Publish Date - 2020-06-04T10:23:23+05:30 IST

జిల్లాలో గన్‌ లైసెన్సు కలిగిన వ్యక్తులకు ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో బుధవారం

గన్‌ లైసెన్సుదారులకు కౌన్సిలింగ్‌

కడప (క్రైం), జూన్‌ 3 : జిల్లాలో గన్‌ లైసెన్సు కలిగిన వ్యక్తులకు ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో బుధవారం కౌన్సిలింగ్‌ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా గన్‌లైసెన్సు ఉన్న వారి తుపాకీ వివరాలు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన రెన్యువల్‌ ప్రొసీడింగ్స్‌ రికార్డుల పరిశీలన కార్యక్రమాన్ని సిబ్బంది నిర్వహించినట్లు తెలిపారు. అలాగే డిపాజిట్‌ చేసిన రశీదు వివరాలు కూడా తనిఖీ చేశారన్నారు. లైసెన్సు ఉన్న వారు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. 

Updated Date - 2020-06-04T10:23:23+05:30 IST