ఏపీఏ గైర్హాజరు కార్మికులకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-10-20T05:37:25+05:30 IST

సింగరేణి సంస్థ ఏపీఏ డివిజన్‌ పరిధిలోని ఆడ్రియాల, 10వ గనిలో పనిచేస్తున్న 78 మంది కార్మికులు తరుచూ గైర్హాజరు అవుతున్న క్రమంలో సింగ రేణి యాజమాన్యం కౌన్సెలింగ్‌ చేపట్టింది.

ఏపీఏ గైర్హాజరు కార్మికులకు కౌన్సెలింగ్‌
కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న అధికారులు

- పాల్గొన్న ఏపీఏ జీఎంఎన్‌వికె శ్రీనివాస్‌ 

రామగిరి, అక్టోబరు 19: సింగరేణి సంస్థ ఏపీఏ డివిజన్‌ పరిధిలోని ఆడ్రియాల, 10వ గనిలో పనిచేస్తున్న 78 మంది కార్మికులు తరుచూ గైర్హాజరు అవుతున్న క్రమంలో సింగ రేణి యాజమాన్యం కౌన్సెలింగ్‌ చేపట్టింది. మంగళవారం స్థానిక ిసీఎన్‌సీవోఏ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు ఏపీఏ జీఎం ఎన్‌వికె శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 35 మంది కార్మి కుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహిం చారు. కార్మికులు గైర్హజరుకు గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా పైఅధికారుల దృష్టికి తీసుకురావలని, డ్యూటి మానుకోవద్దని సూ చించారు. మధ్యానికి బానిసైలై జీవితాలను నాశనం చేసుకొవద్దని  ఏపీఏ  జీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో అదికారులు బైద్య, శ్రీనివాస్‌, విశ్వ మేది, మారుతి, నాగేశ్వర్‌రావు, హరీష్‌, రవిచంద్ర, దాసరి మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T05:37:25+05:30 IST