నేడు ఏఎన్‌ఎంలకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-08-12T05:02:19+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పోస్టులను రెగ్యులర్‌ వారితో బదిలీలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ మార్గదర్శకాలను జారీచేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 224పోస్టులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం సబ్‌ సెంటర్లలో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ల్లో పనిచేస్తున్న వారిని కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేయాలని ముందుగా నిర్ణయించారు.

నేడు ఏఎన్‌ఎంలకు కౌన్సెలింగ్‌

రెగ్యూలర్‌ వారికి మాత్రమే  

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 11 : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పోస్టులను రెగ్యులర్‌ వారితో బదిలీలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ మార్గదర్శకాలను జారీచేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 224పోస్టులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం సబ్‌ సెంటర్లలో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ల్లో పనిచేస్తున్న వారిని కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళను నెలకొనడంతో కమిషనర్‌ కొన్ని మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సబ్‌సెంటర్లలో 240 మంది రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలు ఉండగా వారికి మాత్రమే ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 200 పోస్టుల్లో నియమించేందుకు కౌన్సెలింగ్‌కు 240మందిని పిలిచినట్లు తెలుస్తోంది. అందులో 20 పోస్టుల వరకు ఒంగోలుతోపాటు సమీప ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 180 పోస్టులు పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే ఈ కౌన్సెలింగ్‌ ద్వారా వర్క్‌డ్‌ అడ్జ్‌స్టమెంట్‌ మాత్రమే చేస్తున్నామని, వేతనాలు ప్రస్తుతం ఎక్కడ తీసుకుంటున్నారో అక్కడి నుంచి తీసుకోవచ్చని కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విధానంతో ఎటువంటి సమస్య వస్తుందోనని ఏఎన్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-08-12T05:02:19+05:30 IST