బాసర ఆర్జీయూకేటీలో కౌన్సిలింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-01T23:45:20+05:30 IST

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ( ఆర్జీయూకేటీ ) 2021- 22 సంవత్సరానికి బుధ వారం కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది.

బాసర ఆర్జీయూకేటీలో కౌన్సిలింగ్‌ ప్రారంభం

బాసర: నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ( ఆర్జీయూకేటీ ) 2021- 22 సంవత్సరానికి బుధ వారం కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది. ఎంపికైన విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. యూనివర్సిటీ పరిపాలన  అధికారి రాజేశ్వరరావు మొదటి విద్యార్థికి అడ్మిషన్‌ పత్రాన్ని అందజేసి కౌన్సిలింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 1500మంది విద్యార్థుల్లో ఎన్‌సీసీ, పీహెచ్‌ ప్రత్యేక కెటగిరీ విద్యార్థులకు కౌన్సిలింగ్‌ పూర్తయ్యింది. మిగితా 1404మంది విద్యార్థుల్లో 500ల చొప్పున కౌన్సిలింగ్‌కు పిలుస్తున్నారు. మొదటి రోజైన బుధవారం 500మందిలో 440 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారు. మిగితా 60మంది గైర్హాజరయ్యారు. ఒక్కో గదిలో 20మంది విద్యార్థులను మాత్రమే ఉంచి అధికారులు కౌన్సిలింగ్‌ ప్రక్రియను నిర్వహించారు. గురు, శుక్రవారాల్లో కూడా కౌన్సిలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. గైర్హాజరైన విద్యార్థుల సీట్లను వెయిటింగ్‌ లిస్టు నుంచి భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-09-01T23:45:20+05:30 IST