కాటన్‌ స్ఫూర్తితో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-05-16T06:31:09+05:30 IST

డెల్టాకు కాటన్‌ అందించిన సేవల స్ఫూర్తితో ఇరిగేషన్‌ ఉద్యోగులు పని చేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణు గోపాల్‌ సూచించారు.

కాటన్‌ స్ఫూర్తితో పనిచేయాలి
ధవళేశ్వరంలో కాటన్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్మన్‌ వేణుగోపాల్‌

  • జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌
  • ఘనంగా అపర భగీరథుడి జయంతి
  • నివాళులర్పించిన పలువురు నాయకులు, అధికారులు

ధవళేశ్వరం, మే 15: డెల్టాకు కాటన్‌ అందించిన సేవల స్ఫూర్తితో ఇరిగేషన్‌ ఉద్యోగులు పని చేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణు గోపాల్‌ సూచించారు. గోదావరి నదిపై ఆనకట్ట కట్టి గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్‌ అర్ధర్‌ కాటన్‌ జయంతిని ఆదివారం జిల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ వేణుగోపాల్‌తోపాటు ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాంబాబు, ఇరిగేషన్‌ అధికారులు కాటన్‌ దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అంతకుముందు ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ఎస్‌వీ రాంబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు కాటన్‌ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిం చారు. వైసీపీ రూరల్‌ కో ఆర్డినేటర్‌ చందన్‌ నాగేశ్వరరావు బ్యారేజీ సెంటర్‌ వద్ద కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

 

ఏ ముఖం పెట్టుకుని ‘గడప గడపకు’ వెళ్తున్నారు!

గోపాలపురం, మే 15: రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చి సంక్షేమాభివృద్ధిని విస్మరించిన అధికార పార్టీ ఏ ముఖంపెట్టుకుని గడపగడపకు వెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కొవ్వూరుపాడులో ఆదివారం నిర్వహించారు.  ఇంటిం టికీ వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఆయన ప్రజల కు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అభివృద్ధిని పక్కన పెట్టడంతో పాటు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభి స్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. గత ప్రభుత్వ హ యాంలో మంజూరైన గోపాలపురం, దొండపూడి ప్రధాన రహదారి నిధులను రివర్స్‌టెండరింగ్‌ పేరుతో నిలిపివేసి మూడేళ్లయినా అతిగతి లేకుండా పోయిం దన్నారు. మెట్టప్రాంత ప్రజలకు దాహార్తీ తీర్చే సత్యసాయి మంచినీటి పథకా న్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్ని కార్మికుల జీతాలు ఎగ్గొట్టడం సిగ్గు చేటని అన్నారు. ఇంత చేసి ఏముఖం పెట్టుకుని గడపగడపకు వెళ్తున్నారో అర్థం కావ డం లేదన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా ఎమ్మెల్యేలను సైతం ప్రజలు నిలదీయడంతోపాటు తరిమితరిమి కొడుతున్నా ఈ ప్రభుత్వానికి సిగ్గు రాదా అని ముప్పిడి ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రొంగలి సత్యనారాయణ, కాశీం సాహెబ్‌, చాపల రవి, పడమటి శ్రీను, నారాయణరావు, దంగేటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T06:31:09+05:30 IST