Abn logo
Sep 28 2021 @ 03:05AM

అడుగుకో గొయ్యి..

ఇది ఉభయ గోదావరి జిల్లాలను కలిపే కాటన్‌ బ్యారేజి రోడ్డు. ధవళేశ్వరం-విజ్జేశ్వరం మధ్య ఏడు  కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డుపై నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అడుగుకో గొయ్యి ఏర్పడి.. ఇనుప ఊచలు బయటకు వచ్చిన ఈ రోడ్డుపై ప్రయాణిస్తే.. నరకం కనిపిస్తోందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. రోడ్డు మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు  ముందుకు రావడంలేదని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. గతంలో చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతోనే కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని అంటున్నారు. అధ్వాన్న రోడ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అక్టోబరు 2న ఆందోళన చేపట్టిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ రోడ్డుపై శ్రమదానం చేసి, మరమ్మతులు చేయనున్నారు.


ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరం

క్రైమ్ మరిన్ని...