Jul 24 2021 @ 06:46AM

Ntr: ఎన్టీఆర్ రూ.5 కోట్ల కారు వ‌చ్చేసింది!

మన స్టార్స్‌కు కొత్త కార్లంటే స‌ర‌దా ఎక్కువే. బాలీవుడ్ హీరోలు ర‌ణ్వీర్ సింగ్‌, ర‌ణభీర్ క‌పూర్ స‌హా టాలీవుడ్ హీరోలు ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయ‌ల ఖ‌రీదైన కార్ల‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు వీరి రూట్‌లోకి మ‌రో అగ్ర క‌థానాయ‌కుడైన తార‌క్ కూడా చేరారు. ఎన్టీఆర్ ఖ‌రీదైన లాంబోర్గి కారును బుక్ చేశార‌ని, త్వ‌ర‌లోనే అది హైద‌రాబాద్ చేరుకుంటుంద‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ కారు ఎన్టీఆర్ ఇంటికి చేరుకుంద‌ట‌. ఐదు కోట్ల రూపాయ‌ల తార‌క్ కారు ఇదేనంటూ నెట్టింట కొన్ని ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ కారులో వెళ్లి రామ్‌చ‌ర‌ణ్‌ను తార‌క్ క‌లిశాడ‌ని, చ‌ర‌ణ్ ఇంటి ముందు ఆగిన లాంబోర్గి కారే అందుకు ఉదాహ‌ర‌ణ అని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఎన్టీఆర్ స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం ఆ వార్త‌ల్లో నిజం లేవ‌ని అంటున్నాయి.