Ukraine లో జీవన వ్యయం ఇంత తక్కువా.. ఓ విద్యార్థి ఆ దేశంలో ఉండేందుకు నెలకు ఎంత ఖర్చవుతుందంటే..

ABN , First Publish Date - 2022-02-26T16:55:02+05:30 IST

ప్రస్తుతం రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌.. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు నెలవు. దీంతో భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు.

Ukraine లో జీవన వ్యయం ఇంత తక్కువా.. ఓ విద్యార్థి ఆ దేశంలో ఉండేందుకు నెలకు ఎంత ఖర్చవుతుందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌.. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు నెలవు. దీంతో భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. ఇక ఇక్కడ ఇలా భారీగా అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం రావడానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకొవాల్సింది జీవన వ్యయం. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూరోప్‌లోనే అత్యంత చౌకైన స్టూడెంట్ జీవన వ్యయం గల దేశం ఉక్రెయినే. దాంతో ఆటోమెటిక్ ఇతర దేశాలకు చెందిన విద్యార్థులకు ఉక్రెయిన్ మొదటి ఛాయిస్‌గా మారుతుంది. అలాగే సాంకేతిక, వైద్య విద్య కోర్సులను అక్కడి స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా బోధన ఉండడం మరో కారణం. దీంతో పాటు కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చాలా తక్కువ వ్యయంతో ఉన్నత చదువులు పూర్తి చేసుకోవచ్చనే కారణంతో విదేశీ విద్యార్థులు ఉక్రెయిన్‌కు క్యూకడుతుంటారు. 


ప్రధానంగా భారత విద్యార్థులు ప్రతియేటా వైద్య విద్య కోసం వేల సంఖ్యలో ఉక్రెయిన్‌కు వెళ్తుంటారు. ఎందుకంటే మన దగ్గర నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే వైద్య సీటు దొరుకుతుంది. ఆ సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి. ఇక ఎంట్రన్స్ రాసేవారు భారీ సంఖ్యలో ఉంటారు కనుక ఆటోమెటిక్‌గా కాంపీటేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కోర్సుల ఫీజులు కూడా భారీగానే ఉంటాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌లో ఓ విద్యార్థికి వారు అభ్యసించే కోర్సును బట్టి నెలకు రూ. 22,230 నుంచి రూ. 29,640 వరకు ఖర్చు అవుతుందని సమాచారం. దీంట్లో వసతి, పుస్తకాలు, యూటిలిటీ బిల్స్, ఇతర ఖర్చులు కలిపి ఉంటాయి. ఇక జీవన వ్యయం అనేది ఆ దేశంలోని నగరాలను బట్టి కూడా మారుతోంది. పెద్ద నగరాలైన ఒడెస్సా, కీవ్‌లో జీవన వ్యయం చాలా అధికం. అదే చిన్న నగరాలైన ఖార్కీవ్, సుమీలలో చాలా తక్కువ. అసలు ఉక్రెయిన్‌లో జీవన వ్యయం ఎంత ఉంటుంది? ఓ విద్యార్థి ఆ దేశంలో ఉండేందుకు నెలకు ఎంత ఖర్చవుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం. 


మొదట ఉక్రెయిన్‌లో సగటు జీవన వ్యయంపై ఓ లుక్కేద్దాం..

ఆహారానికి ఒక విద్యార్థికి నెలకు రూ. 10,380 ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి రూ. 1,24,560. అదే అద్దె నెలకు కనీసం రూ. 16,088 అవుతుందంటే సంవత్సరానికి రూ. 1,93,054. ఇక ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌కు నెలకు రూ. 1,112 అవుతుంది. అంటే ఏడాదికి రూ. 13,350 అన్నమాట. మంచి నీటి కోసం నెలకు 1,320 అవుతుంది. సంవత్సరానికి రూ.15,840. బుక్స్ కోసం నెలకు రూ. 147 అయితే, ఏడాది రూ.588. టీవీ కెబుల్‌కు నెలకు రూ.380 వేసుకుంటే ఏడాదికి 4,450. రవాణాకు నెలకు రూ.750 అవుతుందంటే సంవత్సరానికి రూ. 8,900 అవుతుంది. 


ఉక్రెయిన్‌లో కోర్సును బట్టి సగటు ట్యూషన్ ఫీజు..

ఇంజనీరింగ్ - రూ. 1,70,922

కంప్యూటర్ సైన్స్ - రూ.1,70,922

సోషల్ సైన్స్ - రూ. 1,85,785

మెడిసిన్ - రూ. 3,12,118

బిజినెస్ అండ్ ఫైనాన్స్ - రూ. 1,48,628

పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు - రూ. 2,22,942


వసతికి ఉక్రెయిన్‌లో వ్యయం ఇలా..

సిటీ సెంటర్‌లో ఉండే అపార్ట్‌మెంట్‌లోని సింగిల్ బెడ్‌రూంనకు నెలకు రూ. 21,413. అదే సిటీ సెంబర్ బయట ఉండే అపార్ట్‌మెంట్‌లోని సింగిల్ బెడ్‌రూంనకు నెలకు రూ. 12,856. ఇక సిటీ సెంటర్‌లో ఉండే అపార్ట్‌మెంట్‌లోని త్రిబుల్ బెడ్‌రూంనకు నెలకు రూ. 41,690. అదే సిటీ బయట ఉండే అపార్ట్‌మెంట్‌లోని త్రిబుల్ బెడ్‌రూంనకు నెలకు రూ. 24,449.


ఆహారం విషయానికి వస్తే..

ఉక్రెయిన్‌లో లీటర్ పాల ధర రూ. 41.62, డజన్ గుడ్లు రూ. 75, లోకల్ చీజ్ రూ.308, బీఫ్(1 కిలో) రూ. 280, యాపిల్స్(1 కిలో) రూ. 57.96, టమాటలు(1 కిలో) రూ. 95.87, బియ్యం(తెల్లవి) కేజీ రూ. 73.57, అరటి పండ్లు(1 కిలో) రూ. 95.12, మంచి నీరు(1.5 లీటర్ బాటిల్) రూ. 31.12, బంగాళదుంపలు కేజీ రూ. 23 నుంచి రూ. 73 వరకు ఉంటుంది. 

  


Updated Date - 2022-02-26T16:55:02+05:30 IST