Abn logo
Apr 21 2021 @ 00:31AM

కార్పొరేషన తాగునీటి సరఫరా విభాగంలో అవినీతి జలగ

అక్రమ కనెక్షన్లతో భారీగా వసూళ్లు

కనెక్షన తీసుకున్నా అపార్ట్‌మెంట్‌కు రూ.30వేలకుపైగా చెల్లించాల్సిందే 

రూరల్‌ పరిధిలోనూ కనెక్షన్లు


అనంతపురం కార్పొరేషన,ఏప్రిల్‌ 20: నగరపాలక సంస్థలో అవినీతి నానాటికీ హెచ్చుమీరుతోంది. తాగునీటి సరఫరా విభాగంలో నీటి ప్రవాహా న్ని మించిన స్థాయిలో అవినీతి జరుగుతోంది. ఆయన ఓ స్థాయి అధికారి కూడా కాదు. కానీ ఆ విభాగంలో ట్యాప్‌ఇనస్పెక్టర్‌గా అతనిదే కీలక పాత్ర. ఇదివరకు మరో ఉద్యోగి ఉండేవాడు. అతను రిటైరైపోవడంతో ఈయన ఒక్కడే కొనసాగుతున్నాడు. దీంతో అతడి అగడాలకు అడ్డే లేకుండా పో యింది. ఇష్టా రాజ్యంగా అక్రమ కనెక్షనలు ఇచ్చి భారీ వసూళ్లతో అక్ర మార్జనకు పాల్పడుతున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీల్లోని ప్రాం తాలకూ లంచాలు పుచ్చుకుని కనెక్ష నలు ఇచ్చేశాడు. కాంట్రాక్టర్ల పేరుతో వర్క్‌లు కూడా చేసి బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటాడు. 50 డివిజన్లున్న నగరపాలక సంస్థకు కనీసం ముగ్గురు ట్యాప్‌ ఇనస్పెక్టర్లు అవసరం. కానీ అధికారులు ఆదిశగా చర్య చేపట్టడం లే దు. దీంతో అతను మరింత రెచ్చిపోతున్నాడు. అలాగే కింది స్థాయి సిబ్బందిపై బూతులతో విరుచుకుపడతాడు. ఇతని అవినీతి వ్యవహారంపై నగర పాలక సంస్థ కోడైకూ స్తోంది. 


అక్రమ కనెక్షన్లతో భారీ వసూళ్లు

తాగునీటి సరఫరా విభాగంలో ఒకే ఒక్కడు. అందులో నూ జిల్లా కేంద్రం కావడంతో ఇతడికి చాలా డిమాండ్‌. ఆ ఉద్యోగి చూపు కూడా అక్రమ కనెక్ష న్లు కోరే ఇళ్లపైనే. వాటి నుంచే భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లకైతే రూ.75వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంటున్నట్లు సమాచారం. ఇక  అపార్ట్‌మెంట్లకు నిబంధన ల ప్రకారం కనెక్షన్లు ఇచ్చినా ఈయనకు మాత్రం ముట్ట జెప్పాల్సిందే. డిపాజిట్‌, ఈఎండీ, అడ్వాన్స టాక్స్‌ తదితర మొత్తం కార్పొరేషనకు చెల్లించినా ఇతని అనుమతి రా వాలంటే రూ.30వేల పైగా చెల్లించాలట. అక్రమ కనెక్షన్ల విషయంలో పైపులు కూడా కనిపించకుండా లోలోపలే అమర్చేస్తారట. కార్పొరేషనలో ప్రస్తుతం 35,502 ఇళ్ల నుంచి మాత్రమే నీటి పన్ను వసూలవుతున్నట్లు అధికా రిక లెక్కలు చె బుతున్నాయి. ఆస్తి పన్ను 62వేలకుపైగా ఇళ్లకు చెల్లిస్తున్నారు. అందులో దు కాణాలు 10వేల నుంచి 15వేల వరకు  ఉండే  అవకాశముంది. ఈ లెక్క న 45వేల వరకు ఇళ్లున్నాయనుకున్నా 10వేల ఇళ్ల నుంచి నీటి పన్ను వసూ లు కావడం లేదని తెలుస్తోంది. అంటే అవన్నీ అక్రమ కనెక్షన్లేననేది సుస్పష్టం. 


కాంట్రాక్టర్ల పేరుతో సీ బిల్లులు...

ఇతనికి ఇలా వచ్చే ఆదాయం సరిపోలేదో ఏమో  ! కాంట్రాక్టర్‌ తరహాలో మరింత సొమ్ము చేసుకోవడానికి తాపత్రయపడుతుంటాడు. కార్పొరేషనలో సీ బిల్లులది  ప్రత్యేకం. రూ.20వేలలోపు పనులు అత్యవసరం కింద చేసేసు ్తంటారు.  ఇలాంటివి ఇతను ప్రతి నెలా కనీసం 15 నుంచి 20వరకు చేస్తుంటాడని సమాచారం. అవన్నీ అక్కడుండే కార్పొరేటర్ల పేర్లతో బిల్లులు పెట్టేస్తాడు. ఇక్క డున్న మరో మతలబు ఏంటంటే దానికి వాడే పైపులు, వా ల్వ్‌లు, జాయింట్‌లు, టైల్‌పీ్‌సలు, రబ్బర్లు, బోల్ట్‌లు ఇవ న్నీ (మెటీరియల్స్‌ )కూడా కార్పొరేషనకు చెందినవే.  కానీ సొంతంగా కొనుగోలు చేసినట్లు బిల్లులో చూపుతాడట. బిల్లుల విషయంలోనూ చేసిన పనికంటే ఎక్కువ మొత్తం లో బిల్లు వేసి పై అధికారుల వద్ద చివాట్లు తిన్న సంద ర్భాలెన్నో. తాగునీటి విభాగంలో పనిచేసే సిబ్బందితో సైతం కాంట్రాక్ట్‌ వర్క్‌లు చేయిస్తున్నట్లు సమాచారం. కొన్ని సంబంధం లేని పనుల్లో కూడా ఇతను వేలు పెడు తుంటాడని తెలుస్తోంది. ఇలా కూడా నెలనెలా లక్షల్లోనే సొమ్ము చేసుకుంటాడన్న ఆరోపణలున్నాయి. 


కిందిస్థాయి సిబ్బందిపై బూతుపురాణం...

ఇంత అవినీతి వ్యవహారాలు నడుపుతున్న ఈయన తన కింద పనిచేసే సిబ్బందిపై బూతులతో రెచ్చిపోతుం టాడని సమాచారం. ఫిట్టర్లు, మెకానిక్‌లు, వర్కర్లతో మా ట్లాడే భాషలో ఏమాత్రం గౌరవముండదట. తాజాగా ఈ విషయంపై సిబ్బంది ఇనచార్జ్‌ ఎస్‌ఈకి ఫిర్యాదు చేశారట. మరో అడుగు ముందుకేసి నిబంధనలకు విరుద్ధంగా  రూ రల్‌ మండల పరిధిలోని పంచాయతీల్లో ఉన్న ఇళ్లకు అక్ర మ కనెక్షన్లు ఇచ్చారు. ఆయా ఇళ్ల యజమానులతో ఆమ్యా మ్యాలు పుచ్చుకుని సంఘమిత్రనగర్‌ ట్యాంకు ఆ పరిసర పంచాయతీ ప్రాంతాల్లో కనెక్షన్లు ఇచ్చినట్లు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement