ఉపాధిహామీ పనుల్లో బయటపడిన అవినీతి

ABN , First Publish Date - 2021-10-27T06:27:07+05:30 IST

మండలంలోని వడుకాపూర్‌ గ్రామంలో మంగళవారం ఉపాధిహామీ పనుల సామాజిక తనిఖీ నివేదిక గ్రామసభను పంచాయతీ కార్యాలయం ఆవ రణలో నిర్వహించారు.

ఉపాధిహామీ పనుల్లో బయటపడిన అవినీతి
ఉపాధిహామీ పనుల్లో అవినీతిపై పంచాయతీ కార్యదర్శిని నిలదీస్తున్న గ్రామస్థులు

- సామాజిక తనిఖీ గ్రామసభలో నిలదీసిన గ్రామస్థులు 

జూలపల్లి, అక్టోబర్‌ 26 : మండలంలోని వడుకాపూర్‌ గ్రామంలో మంగళవారం ఉపాధిహామీ పనుల సామాజిక తనిఖీ నివేదిక గ్రామసభను పంచాయతీ కార్యాలయం ఆవ రణలో నిర్వహించారు. ఉపాధిహామీ పనుల నివేదిక, కూలీ ల వివరాలను సామాజిక తనిఖీ సభ్యులు చదివి వినిపిం చారు. ఉపాధిహామీలో 165 పనులకు గాను 22 లక్షల 95 వేల 691 రూపాయలు కాగా, 262 జాబ్‌కార్డులు కలిగిన కూలీలు పనిచేసినట్లు వివరించారు. అదే పంచాయతీ కార్యాలయంలో కారోబారుగా విధులు నిర్వహిస్తున్న వడ్ల కొండ తిరుపతి ఉపాధిహామీ పనులు చేసినట్లుగా, అలాగే ఒక ప్రైవేటు జూనియర్‌ కళాశాలో అధ్యాపకుడిగా పనిచే స్తున్న నేరేడికొమ్మ నరహరి పనిచేసినట్లుగా తప్పుడు మస్ట ర్లు వేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని పంచాయతీ కార్యదర్శి అంజయ్యపై వేల్పుల ఓదెలుతో పాటు గ్రామస్థు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అసలు పని చేసిన కూలీలకు మస్టర్లు వేయకుండా పంచాయతీ కార్యద ర్శి, మేటిలకు అనుకూల వ్యక్తులకు పని చేయకున్నా మస్టర్లు వేశారని గ్రామస్థులు ఆందోళన వ్వక్తం చేశారు. పనులు చేయని వ్యక్తుల పేరున, కారోబార్‌ పేరున అనుకూలమైన వ్యక్తులకు మస్టర్లు రాసుకుని ప్రజాధ నాన్ని దుర్వినియోగం చేశారని కార్యదర్శి అంజయ్యను గ్రామస్థులు నిలదీశారు. గ్రామంలోని కొందరి పెద్దల ప్రమేయంతోనే ఇలా చేశానని గ్రామసభ సాక్షిగా కార్యదర్శి అంజయ్య వెల్లడించారు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైనా గ్రామస్థులు అవినీతిని చేయించిన పెద్దల పేర్లను వెల్లడించాలని పట్టుబట్టడంతో, జరిగిన తప్పిదాలకు తానే బాధ్యత వహి స్తానని పేర్కొన్నారు. ఉపాధిపని చేయకుండా చేసినట్లుగా మస్టర్లను ఫోర్జరీ సంతకాలు చేశారంటూ వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవా లని కోరుతూ సామాజిక తనిఖీ సభ్యులకు గ్రామస్థులు లిఖితపూర్వకం గా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మాంకాలి తిరుపతి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, వార్డు సభ్యులు రేచవేని ఐలయ్య, మేటి అట్ల రాజు, మాజీ విద్యాకమిటీ చైర్మన్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రా వు, బీజేపీ నాయకులు వేల్పుల ఓదెలు, మొగురం బీమయ్య, ఇంజపూరి ప్రేమ్‌, మోదుంపల్లి చింటూ, అట్ల సంతోష్‌, జెట్టి రాజయ్య, ఈదుల కం టి చింటూ, పిట్టల రాజు, యాదగిరి, సాయి, ఇంజపూరి తిరుపతి, మాం కాలి హనమమ్మ, ఆసంపెల్లి దేవమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:27:07+05:30 IST