ఇళ్ల పట్టాల పేరుతో అవినీతి: సోము ఆగ్రహం

ABN , First Publish Date - 2020-06-06T09:58:04+05:30 IST

‘‘రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పేరుతో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ ఆవ భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. తెనాలి, ఆదోని తదితరచోట్ల ఇదే తరహా దోపిడీ వ్యవహారాలు

ఇళ్ల పట్టాల పేరుతో అవినీతి: సోము ఆగ్రహం

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 5: ‘‘రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పేరుతో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ ఆవ భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. తెనాలి, ఆదోని తదితరచోట్ల ఇదే తరహా దోపిడీ వ్యవహారాలు వెలుగు చూశాయి’’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో పార్టీ నాయకులతో కలసి ఆయన ఆవ భూముల అక్రమాలపై నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో వేలకోట్లు అవినీతి జరిగిందన్న జగన్‌ ఇప్పటివరకూ ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తన ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో సాగుతున్న దోపిడీ బయటకు వస్తుందనే కారణంతోనే విచారణ జరిపించలేదనే అనుమానం కలుగుతోందన్నారు.

Updated Date - 2020-06-06T09:58:04+05:30 IST