అవినీతి,తప్పుడు లెక్కలపై విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2020-11-29T05:32:20+05:30 IST

ధర్మపురి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, తప్పుడు లెక్కలపై సమగ్ర విచారణ జరిపించాలని మున్సిపల్‌ వైస్‌చై ర్మన్‌ ఇందారపు రామయ్య సహా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిల్‌ సభ్యు లు నాగలక్ష్మి, సంతోషి, పద్మ, అరుణ డిమాండ్‌ చేశారు.

అవినీతి,తప్పుడు లెక్కలపై విచారణ జరిపించాలి
సమావేశంలో సభ్యులు వాదనకు దిగిన దృశ్యం

ధర్మపురి మున్సిపల్‌ సమావేశంలో సభ్యులు డిమాండ్‌

ధర్మపురి, నవంబరు 28: ధర్మపురి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, తప్పుడు లెక్కలపై సమగ్ర విచారణ జరిపించాలని మున్సిపల్‌ వైస్‌చై ర్మన్‌ ఇందారపు రామయ్య సహా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిల్‌ సభ్యు లు నాగలక్ష్మి, సంతోషి, పద్మ, అరుణ డిమాండ్‌ చేశారు. స్థానిక మున్సి పల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ అధ్యక్షతన శనివారం సాదారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిషనర్‌ రా జలింగం, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రా రంభంలో వైస్‌చైర్మన్‌ రామయ్య లేచి గత 2018-19లో మున్సిపాలిటీలో చేపట్టని పనులకు 86 లక్షలు ఖర్చులు చూపించి బిల్లులు తీసుకున్నార ని, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హరితహారం లో భాగంగా పట్టణంలో 3500 మొక్కలు నాటడం కోసం రూ 4 లక్ష లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారని, క్షేత్ర స్థాయిలో ఎన్ని నాటా రో అధికారులు సమాచారం చెప్పడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చే శారు. మున్సిపల్‌ తాత్కాలిక ఉద్యోగి పేరుతో పనులు చేయించి, ఎంబీ రికార్డు చేయించి అవినీతికి పాల్పడ్డారన్నారు. మున్సిపల్‌ పరిధిలో చేప ట్టే పనుల కోసం మంజూరు చేసిన 44 లక్షల పనులను టెండర్‌ ప్రకా రం చేయించాలని కోరారు. గతంలో ఇక్కడ పని చేసిన మున్సి పల్‌ మే నేజర్‌ అవినీతికి పాల్పడి, రికార్డులు సక్రమంగా చూపించలే దన్నారు. తన వద్ద సహ చట్టం కింద తీసుకున్న పూర్తి సమాచారం ఉందని, అ వినీతి జరిగినట్లు నిరూపిస్తానని లేకుంటే తన పదవికి రాజీనామా చే స్తానని వైస్‌చైర్మన్‌ రామయ్య తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సత్య మ్మ మాట్లాడుతూ కౌన్సిల్‌ సభ్యులు అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని, స మావేశాన్ని కొనసాగించేందుకు సహకరించాలన్నారు. ఇదిలా ఉండగా సమావేశం అనంతరం ఒక కౌన్సిలర్‌ భర్త, నలుగురు మహిళా కౌన్సిల ర్లు మధ్య జరిగిన వాదన, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌, చైర్‌పర్సన్‌ తనయుడి మధ్య జరిగిన వాదన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో మేనేజర్‌ సంపత్‌రెడ్డి, ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ ఏఈఈలు మనోహర్‌, స తీష్‌, టీపీఎస్‌ తేజస్విని, అకౌంట్‌ అధికారి నాగరాజు, శానిటరీ ఇన్స్‌పె క్టర్‌ గంగాధర్‌, కౌన్సిల్‌సభ్యులు అశోక్‌, ఉమాలక్ష్మి, పద్మ, విజయలక్ష్మి, వేణుగోపాల్‌, సుధాకర్‌, సయ్యద్‌ యూనస్‌, కోఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ అలీమొద్దీన్‌, అప్పాల వసంత్‌, మహ్మద్‌ ఉజ్మ తబస్సుం పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-29T05:32:20+05:30 IST