Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైఎన్‌లో కార్పొరేట్‌ ఫీజులుండవ్‌

 కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణనరసాపురం,అక్టోబరు 24 : వైఎన్‌ కళాశాల సేవా దృక్పథంతో ఏర్పాటు చేశారని, కార్పొరేట్‌ తరహాలో ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉం డదని  కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణ అన్నారు. కళా శాలలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎయిడెడ్‌ విధానాన్ని తొల గించినంత మాత్రాన ప్రైవేట్‌ కాలేజీ అయిపోలేదన్నారు. దాతలు కాలేజీని అప్పట్లోనే కోపరేటివ్‌ సొసైటీగా ఏర్పాటు చేశారన్నారు.ఇటీవల ఎమ్మెల్సీలు సాబ్జీ, ఐ.వెంకటేశ్వరావు కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పడం సరికాద న్నారు. కళాశాలలో యూనివర్సిటీ నిర్ధేశించిన ఫీజులనే వసూలు చేస్తామన్నారు. సమావేశంలో కోశాధికారి పొన్నమండ రామకృష్ణారావు, అందే సతీష్‌, ప్రిన్సిపాల్‌ పార్థసారథి, చింతారావు, రిటైర్ట్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement