బస్తీ దవాఖానా@168

ABN , First Publish Date - 2020-05-23T11:15:32+05:30 IST

బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ కార్పొరేటర్‌ షాహీన్‌ బేగంకు మున్సిపల్‌

బస్తీ దవాఖానా@168

ఫ్లెక్సీ ఏర్పాటుపై కేటీఆర్‌  ఫైర్‌

కార్పొరేటర్‌కు రూ.20 వేల జరిమానా


ఒకే రోజు 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించడం ద్వారా కొత్త రికార్డు నమోదైంది. వివిధ ప్రాంతాలలో మంత్రులు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఇంతకు ముందు ఉన్నవి 123 కాగా  కొత్తవాటితో కలిపి దవాఖానాల సంఖ్య 168కి చేరుకుంది. 


ఎర్రగడ్డ, మే 22 (ఆంధ్రజ్యోతి): బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ కార్పొరేటర్‌ షాహీన్‌ బేగంకు మున్సిపల్‌ అధికారులు 20 వేల రూపాయల జరిమానా విధించారు. శుక్రవారం ఎర్రగడ్డలోని ఓల్డ్‌ సుల్తాన్‌ నగర్‌లో జరిగిన బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా.. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ తదితర నాయకులతో రూపొందించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన కేటీఆర్‌ ఆ ఫ్లెక్సీలు చూసి మండిపడ్డారు. షాహిన్‌ బేగంకు 20 వేల రూపాయల జరిమానా విధించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల ప్రకారం జరిమానా విధించినట్లు మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ రమేష్‌ తెలిపారు.


ఇవి వివరాలు

మొత్తం దవాఖానాలు : 168 

వేళలు : ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు..


వైద్య సేవలు... 

ఓపీ కన్సల్టేషన్‌

టెలీ కన్సల్టేషన్‌ 

బేసిక్‌ ల్యాబ్‌ పరీక్షలు

ఉచిత మందులు 

టీకాలు

గర్భిణులు, బాలింతల సంరక్షణ చర్యలు

కుటుంబ నియంత్రణకు కౌన్సిలింగ్‌

బీపీ, బ్లడ్‌ షుగర్‌, క్యాన్సర్‌ తదితర ఆరోగ్య సమస్యలకు స్ర్కీనింగ్‌

రక్తహీనత పరీక్షలు


పరీక్షలు...

108 రకాల పరీక్షలు (ఐపీఎం సహకారంతో)

ఒక్కో దవాఖానాలో... వైద్యుడు/వైద్యురాలు నర్స్‌ సహాయక సిబ్బంది

ప్రతి నెలా ఖర్చు - రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షలు

Updated Date - 2020-05-23T11:15:32+05:30 IST