కౌన్సిలర్‌ పదవికి Ops సోదరుడు పోటీ?

ABN , First Publish Date - 2022-02-05T16:23:03+05:30 IST

పెరియకుళం మున్సిపల్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం నాలుగో సోదరుడు ఒ.షణ్ముగసుందరం పోటీచేస్తున్నారు. ఆ మున్సిపాలిటీలోని 24 వార్డులో అన్నాడీఎంకే అభ్యర్థిగా

కౌన్సిలర్‌ పదవికి Ops సోదరుడు పోటీ?

చెన్నై: పెరియకుళం మున్సిపల్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం నాలుగో సోదరుడు ఒ.షణ్ముగసుందరం పోటీచేస్తున్నారు. ఆ మున్సిపాలిటీలోని 24 వార్డులో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ వేశారు. తేని జిల్లా పెరియకుళం మున్సిపాలిటీకి 1996లో జరిగిన ఎన్నికల్లో ఓపీఎస్‌ అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి చైర్మన్‌ అయ్యారు. ఆ తర్వాత ఆయన పార్టీలో అంచెలంచెలుగా కీలక పదవులు పొందుతూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 2011లో పన్నీర్‌సెల్వం సోదరుడు ఒ.రాజా ఆ మున్సిపాలిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. ఇలా పెరియకుళం మున్సిపల్‌ ఎన్నికల్లో పన్నీర్‌ సెల్వం కుటుంబీకులే గెలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం నాలుగో సోదరుడు షణ్ముగసుందరం పోటీకి దిగారు. పెరియకుళం మున్సిపాలిటీలో పోటీ చేయనున్న 30 మంది అభ్యర్థుల జాబితా ఇటీవలే విడుదలైంది. ఆ జాబితాలో 24వ వార్డులో రాజేంద్రన్‌ అనే స్థానిక నాయకుడు పోటీ చేస్తారని ప్రకటించారు. చివరి క్షణంలో అభ్యర్థిని అన్నాడీఎంకే  మార్పు చేసింది. రాజేంద్రన్‌కు బదులుగా పన్నీర్‌సెల్వం సోదరుడు  పోటీ చేస్తారని ప్రకటించింది.

Updated Date - 2022-02-05T16:23:03+05:30 IST