కార్పొరేట్‌ వల!

ABN , First Publish Date - 2022-05-04T05:35:33+05:30 IST

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ఉన్నత భవిష్యత్తు అందించేందుకు తపన పడుతుంటారు. అందుకు ఎంత కష్టమైనా.. ఎంత ఖర్చయినా నాణ్యమైన విద్యనందించాలని కోరుకుంటారు.

కార్పొరేట్‌ వల!

జిల్లాలో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల కోసం వేట 

పదో తరగతి పరీక్షలు రాయకముందే తల్లిదండ్రులకు గాలం 

విద్యార్థులను చేర్పించుకునేందుకు ఫోన్‌ కాల్స్‌

పీఆర్వోలను రంగంలోకి దించిన కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలు

ఎన్నికలను తలపించేలా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం

కామారెడ్డి, మే 3(ఆంధ్రజ్యోతి): ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ఉన్నత భవిష్యత్తు అందించేందుకు తపన పడుతుంటారు. అందుకు ఎంత కష్టమైనా.. ఎంత ఖర్చయినా నాణ్యమైన విద్యనందించాలని కోరుకుంటారు. అలాంటి వారి ఆరా టాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి కార్పొరేట్‌ కళాశాలలు. తమ కళాశాలలో చేర్పిస్తే మీ పిల్లలు ఇలా.. అలా.. అవుతారంటూ మభ్యపెడుతూ మారడిగాయ చేస్తున్నారు. ఇప్పుడే అడ్మిషన్‌ తీసుకుంటే ఇంత శాతం తగ్గుతుందని ప్యాకేజీల పేరిట కోర్సుకో రేటు కడుతూ.. ఇంటి వద్దనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఇష్టమైన కోర్సు కాకుండా వారు చెప్పిన కోర్సులోనే జాయిన్‌ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. ఆ తర్వాత ఈ ఫీజులు.. ఆ ఫీజులంటూ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని కరిగించేస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు.

పదో తరగతి పరీక్షలు ఇంకా ప్రారంభమే కాలేదు. కానీ కార్పొరేట్‌ కళాశాలలు, చిన్నాచితకా ప్రైవేటు కళాశాలలు తమ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించుకునేందుకు అప్పుడే వేట మొదలు పెట్టాయి. కళాశాలల్లో పని చేసే అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి కమీషన్ల ఆశ చూపి అడ్మిషన్ల ప్రక్రియను మొదలు పెట్టాయి. దీంతో వారు మారి విద్యార్థుల అడ్రస్‌లను, తల్లిదండ్రుల ఫోన్‌ సేకరించి మరీ ఇంటింటికీ తిరుగుతూ మభ్యపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజుల్లో రాయితీ అంటూ ఆశ చూపుతుండడం.. తమ కళాశాలలో ఐఐటీ, త్రిఫుల్‌ ఐటీ, నీట్‌ లాంటి కోచింగ్‌లు, హాస్టల్‌ వసతి, విశాలమైన ప్రయోగ శాలలు ఉన్నాయంటూ మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. తరచూ ఫోన్లు చేయడం.. మాటిమాటికి ఇళ్లకు వెళ్లడంతో తల్లిదండ్రులు అంగీకరించక తప్పడం లేదు. 

అయోమయంలో తల్లిదండ్రులు..

ప్రతిఏటా పరీక్షలు ముగియగానే అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను ఏ కళాశాలలో చేర్పించాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. దీనికి తోడు ప్రైవేటు కళాశాల వారు ఇప్పుడే అడ్మిషన్లను బుక్‌ చేసుకోకుంటే రేటు మరింత పెరిగిపోతుందంటూ భయానికి గురి చేస్తున్నారు. ఇటు విద్యార్థులపై కూడా ఒత్తిడి పెంచుతున్నారు. అడ్మిషన్లు తీసుకునే వరకు కాకా పడుతున్నారు. దీంతో తల్లిదండ్రు లు ముందగానే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇలా కామారెడ్డి జిల్లాలో కాకుండా హైదరా బాద్‌లోని పలు కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలు ఇంటర్‌ అడ్మిషన్ల వేటలో ఎన్నికలను తలపించేలా జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. 

డబ్బులిచ్చి విద్యార్థుల డే టా సేకరణ..

పదోతరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల డేటాను ఆయా పాఠశాలల నుంచి సేకరించిన కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యం ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లకోసం ముందస్తు చర్యలు చేపట్టింది. అడ్మిషన్లు చేయించిన ఏజెం ట్లకు కమీషన్లతో పాటు వేతనాలు కూడా చెల్లిస్తుండడంతో డబ్బులకు ఆశపడి ఏజెంట్లు విద్యార్థులను ఆయా కళాశాలలో చేర్పించేందుకు కసరత్తును మొదలుపెట్టారు.దీంతో ప్రైవేట్‌, ప్రభు త్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు లేదంటే వారి తల్లిదండ్రులకు ఏజెంట్లుఫోన్‌లు చేస్తున్నా రు. ఇంటర్‌లో కోరిన కోర్సులో సీటు ఇప్పిస్తామంటూ ఆఫర్లు సైతం ఇస్తున్నా రు. పదోతరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్‌ తీసుకుంటే త క్కువ ఫీజు ఉంటుందని ఆ తర్వాత ఫీజులు పెరుగుతాయని, ముందుగానే సీటు రిజర్వ్‌ చే సుకోకపోతే ఆ తర్వాత కోరిన బ్రాంచ్‌లో సీటు దొరకదని బెదరగొడుతున్నారు. దీంతో ఫలితాలు వచ్చాక ఎలాగో కార్పొరేట్‌ కళాశాలలోనే చే ర్పిస్తాం కదా అనే ఉద్దేశంతో అడ్మిషన్‌ ఆఫర్ల వ లలో తల్లిదండ్రులను చిక్కుతున్నారు. ఇలా జి ల్లాలో ఇప్పటికే భారీ ఎత్తున విద్యార్థులు చాలా కళాశాలల్లో అడ్మిషన్లు పొందినట్లు సమాచారం. 

ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లమోతే..

ప్రైవేట్‌,ప్రభుత్వ పాఠశాలలో 10 వతరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లు రావడంతో ఇదేమో మేత రా బాబు అంటూ వాపోతున్నారు. ఎవరైనా తల్లిదండ్రులు పరీక్షల ఫలితాలు రాకముందే ఎలా చేర్పించాలంటూ ప్రశ్నిస్తే మీ పిల్లలు బాగానే చదువుతారని తమకు సమాచారం ఉందని తప్పకుండా పాస్‌అవుతారని చెబుతూ అవసరమైతే పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు నుంచి సైతం తల్లిదండ్రులకు మాట్లాడిస్తున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా తాము చేర్పించుకుంటామని ఒకవేళ పాస్‌ కాకపోతే చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామంటు హామీలిస్తున్నారు. 

అప్రమత్తతే ముఖ్యం..

తల్లిదండ్రులు తొంతర పడి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నిఫుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కాలేజీల్లో చేరితే తర్వాత ఎవరూ పట్టించుకోరని పేర్కొంటున్నారు. గత సంవత్సరం సైతం తల్లిదండ్రులు కార్పొరేట్‌ గారడిలో పడి మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఏజెంట్లు అడ్మిషన్‌ చేయించడం ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోవడం షరా మాములూగా మారింది. కార్పొరేట్‌ కళాశాలలో చేర్పించే ముందు విద్యార్థుల అభిప్రాయాలతో పాటు ఆ కళాశాలలో విద్యానాణ్యత, విద్యాబోధన చేస్తున్న వారి అనుభవం, ఆ కళాశాలకు చెందిన సీనియర్‌ విద్యార్థులు, పూర్వవిద్యార్థులను అడిగి తెలుసుకోవడంతో పాటు హాస్టల్‌లో ఉంచినట్లయితే వసతిలపై ఆరా తీసిన తర్వాతనే అడ్మిషన్‌కై మొగ్గు చూపాలి. తమ విద్యవ్యాపారం కోసం నిత్యం పుస్తకమే ప్రపంచంగా మార్చే కళాశాలలు కోకొల్లలుగా ఉన్నాయి. అటాంటి కళాశాలలో చేర్పిస్తే విద్యార్థి తీవ్ర ఒత్తిడికి గురై మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎద్కురొనే పరిస్థితులు లేకపోలేదు. అందుకని తోందరపాటు చర్యలతో కార్పొరేట్‌ కళాశాల మయలో పడి విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు కల్గకుండా తల్లిదండ్రులు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.

ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య ..

- సలాం, ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి, కామారెడ్డి

ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య అందుతుంది. నిఫుణులైన అధ్యాపకులతో బోధన సాగుతుంది. తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలోనే తమ పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి. కార్పొరేట్‌,ప్రైవేట్‌ కళాశాలల మాయలో పడి ఆర్థికంగా నష్టపోవద్దు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బోధనతోపాటు స్కాలర్‌షిప్‌ వంటి సౌకరాలనుకల్పిస్తోంది. పదోతరగతి పరీక్షలు కాకముందే ఎవరైనా ప్రవేశాల కోసం ఇంటికి వచ్చినా, ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేసినా తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. 


Read more