ప్రభుత్వాసుపత్రిలో కార్పొరేట్‌ వైద్యం: మంత్రి కొడాలి

ABN , First Publish Date - 2020-07-07T09:51:50+05:30 IST

పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు ఆసుపత్రి అభి వృద్ధి కమిటీ కృషి చేయాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ

ప్రభుత్వాసుపత్రిలో కార్పొరేట్‌ వైద్యం: మంత్రి కొడాలి

 గుడివాడ, జూలై 6 :  పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు ఆసుపత్రి అభి వృద్ధి కమిటీ కృషి చేయాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేంలో సోమవారం ఆయన మాట్లాడారు. నూతన భవన నిర్మాణానికి రూ.10.20 కోట్లు మంజూరు చేయించి, వైద్యుల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా సేవలం దిస్తామన్నారు.


ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్‌గా ఎం.వి.నారాయణరెడ్డిని నియమించినట్లు దుక్కిపాటి శశిభూషణం తెలిపారు. ఎంపీ బాలశౌరి, ఆర్డీవో జి.శ్రీనుబాబు, సూపరింటెండెంట్‌ ఇందిరాదేవి, దయల్‌ జీవావత్‌, అద్భుతరావు, వెంకటలక్ష్మి, ప్రకాష్‌రాజ్‌, డాక్టర్‌ సోమూరి వెంకట్రావు, డాక్టర్‌ పిలక్ష్మీబాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు.  

Updated Date - 2020-07-07T09:51:50+05:30 IST