నిరుపేదలకు అందుబాటులో కార్పొరేట్‌ వైద్యం

ABN , First Publish Date - 2022-08-11T06:01:30+05:30 IST

గ్రామీణ నిరుపేద ప్రజలకు ప్రభుత్వం కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

నిరుపేదలకు అందుబాటులో కార్పొరేట్‌ వైద్యం
ధర్మపురిలో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ధర్మపురి, ఆగస్టు 10: గ్రామీణ నిరుపేద ప్రజలకు ప్రభుత్వం కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ వివిధ సందర్భాల్లో రోగాల బారినపడి, ప్రమాదాలకు గురై వైద్యం చేయించు కోలేని స్థితిలో బాధితులు తన దృష్టికి తీసుక వచ్చినట్లు తెలిపారు. దీంతో వెంటనే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకవెళ్లి వైద్య చికిత్స కోసం ముఖ్యమం త్రి సహాయ నిధి నుంచి ఆర్థికసాయం మంజూరు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీముబా రక్‌ ఒక వరమని ఆయన అన్నారు. ఈ పథకం కింద అనేక మంది నిరుపేద ఆడపడుచులకు ఆర్థికసాయం అందించడం వల్ల వివాహ సమ యంలో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలో గల ఆరు మండలాలకు చెందిన 704 మంది లబ్ధిదారులకు రూ.2,43,82,500 సీంఎఆర్‌ఎఫ్‌ చెక్కులు, 20 మంది లబ్దిదారులకు రూ. 1,00,116 చొప్పున మొత్తం 20,02,320 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన వివ రించారు. అలాగే ధర్మపురి పట్టణంలోని బోయవాడకు చెందిన డి సురేష్‌ అనే లబ్ధిదారుడికి ముందస్తు వైద్యం కోసం రూ. 3 లక్షల ఎల్‌వోసీ అంది స్తున్నట్లు తెలిపారు. తనకు ప్రజలు నేరుగా సమస్యలు వివరించాలని  అన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌ రెడ్డి, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, ధర్మపురి, బుగ్గారం జడ్పీటీసీలు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్‌, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌, మండల తహసీల్దార్‌ గణేష్‌, ఆర్‌ఐ చరణ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ అక్కెనపెల్లి సునీల్‌కుమార్‌, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ సౌళ్ల భీమయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు ఆకుల రాజేష్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:01:30+05:30 IST