జిల్లా ప్రజలకు కార్పొరేట్‌ వైద్య సేవలు : మంత్రి

ABN , First Publish Date - 2022-08-11T07:00:51+05:30 IST

మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్ర జలకు కార్పొరేట్‌ వైద్య సేవలు మరింత దగ్గర కానున్నాయని, వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అట వీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి చెప్పారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటు కల సాకారం కావడంతో బుధవారం జిల్లా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు.

జిల్లా ప్రజలకు కార్పొరేట్‌ వైద్య సేవలు : మంత్రి

నిర్మల్‌ చైన్‌గేట్‌, ఆగస్టు 10: మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్ర జలకు కార్పొరేట్‌ వైద్య సేవలు మరింత దగ్గర కానున్నాయని, వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అట వీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి చెప్పారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటు కల సాకారం కావడంతో బుధవారం జిల్లా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీర్‌ ప్రజల కోరికను నెరవేర్చారని, ప్ర జల తరపున సీఎం కేసీఆర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావుకు ధన్యవాదాలు తెలిపారు. వైద్య కళాశాలతో నిర్మల్‌ అద్భుతమైన వైద్య వి జ్ఞాన కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్థానికంగా ఖరీదైన వైద్యం ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. నిర్మల్‌ జిల్లా  అ భివృద్ధిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నామని, వైద్య కళాశాల మంజూరు  కావడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో నర్సింగ్‌ కాలేజ్‌ కూడా ఏర్పా టు కానుందని తెలిపారు. నిర్మల్‌ జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కాలేదని కొంతమంది అవగాహన రాహిత్యంతో అవాకులు చెవాకులు పెలారని, ఇప్పుడు వారు ఏం సమాధానం చెప్పుతారని ప్రశ్నించారు. ఇ ప్పటికైనా వక్రబుద్ధితో మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. 

నిర్మల్‌లో సంబురాలు..

ఎన్నో ఏళ్ల మెడికల్‌ కళాశాల ఏర్పాటు కల సాకారం కావడంతో జి ల్లా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీష్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా మంత్రిని గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టపాసులు పేల్చి జేజేలు పలికారు. 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

నందిగుండం దుర్గామాత ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండాజీ వెంకట చారి కూమార్తె ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో మంత్రి అల్లోల బుధవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్ర వోతు రాజేందర్‌, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము ఉన్నారు.

ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి

సారంగాపూర్‌: ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. బుధవారం గండి రామన్న హరితహారంలో భాగంగా జాతీయ జెండాలను పంపిణీ చేసి మొక్కలను నాటారు. 

Updated Date - 2022-08-11T07:00:51+05:30 IST