కరోనా కట్టడికి మేము సైతం

ABN , First Publish Date - 2020-04-08T09:23:17+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారు. మంగళవారం బేగంపేటలోని ప్రగతిభవన్‌లో...

కరోనా కట్టడికి మేము సైతం

  • సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ
  • రూ.కోటి విరాళం ఇచ్చిన జీఎంఆర్‌ గ్రూప్‌
  • కరీంనగర్‌ గ్రానైట్‌ వ్యాపారులు 75 లక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారు. మంగళవారం బేగంపేటలోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాలను చెక్కుల రూపంలో అందించారు. జీఎంఆర్‌ గ్రూప్‌ తరఫున రూ.కోటి చెక్కును, కరీంనగర్‌ గ్రానైట్‌ వ్యాపారస్తులు రూ.75 లక్షల నగదు, రూ.కోటి విలువైన మెడికల్‌ పరికరాల్ని విరాళంగా ప్రకటించారు. కరీంనగర్‌ గ్రానైట్‌ క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రూ.50లక్షలు, మార్వాడీ గ్రానైట్‌ ఫ్యాక్టరీస్‌ అసోసియేషన్‌ తరఫున రూ.25 లక్షలు సీఎంఆర్‌ఎఫ్‌లో చేరాయి.


కేటీఆర్‌కు విరాళాలిచ్చిన పలువురు!

విజ్‌ రియల్టర్స్‌ తరఫున ఆ సంస్థ ప్రతినిధులు రూ.కోటి విరాళాన్ని మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఏన్‌సైరా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు రూ.కోటి,  పెన్నా సిమెంట్స్‌, రత్నదీప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చెరో రూ.కోటి అందజేసింది. దొడ్ల డైరీ లిమిటెడ్‌, ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌, వశిష్ట కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున తలా రూ.25లక్షలు అందించారు. గాయత్రి గ్రానైట్స్‌ రూ.25 లక్షలు, సీటింగ్‌ వరల్డ్‌ తరఫున నాలుగు వేల సూట్లు, మాస్కుల్ని మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు మంత్రి కేటీఆర్‌కు విరాళాలు అందించారు. హమీద్‌, సమీర్‌ రహమాన్‌ రూ.కోటి చెక్కును మంత్రి కేటీఆర్‌కు ఇచ్చారు. అగ్రసేన్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ తరఫున రూ.21లక్షలు, నీరూస్‌ ఏస్‌ సెంబుల్స్‌ తరఫున రూ.20లక్షలు, రిజెనెసిస్‌ ఇండస్ట్రీస్‌ రూ.10 లక్షలు,. సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌ జువెల్లర్స్‌ అసోసియేషన్‌  రూ.10లక్షలు, పాట్‌ మార్కెట్‌లోని 39మంది స్వర్ణకారులంతా కలిసి రూ.7.32లక్షలు కేటీఆర్‌కు అందించారు. న్యూక్లబ్‌ ఫ్యామిలీ అండ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్‌ రూ.5లక్షలు, సివిల్‌ సప్లయీస్‌ హమాలీ కార్మికులు రూ.2లక్షల చెక్కును కేటీఆర్‌కు అందించారు. కాగా, ఇటీవల పదవీ విరమణ చేసిన టీవీ రమణాకర్‌ అనే డాక్టర్‌ రూ.లక్ష, ది వరంగల్‌ డిస్ట్రిక్ట్‌ గంగపుత్ర మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ తరఫున రూ.లక్ష దయాకర్‌కు ఇచ్చారు. బేగంపేట వసంత్‌ కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ. 25 లక్షల విరాళం ప్రకటించి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేసింది.


Updated Date - 2020-04-08T09:23:17+05:30 IST