డయల్‌ యువర్‌ కమిషనర్‌కు 34 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-07-24T05:47:22+05:30 IST

స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్‌ యువర్‌ కార్యక్రమానికి శుక్రవారం 34 ఫిర్యాదులు అందినట్లు నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు.

డయల్‌ యువర్‌ కమిషనర్‌కు 34 ఫిర్యాదులు
కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), జూలై 23: స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్‌ యువర్‌ కార్యక్రమానికి శుక్రవారం 34 ఫిర్యాదులు అందినట్లు  నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. నగర ప్రజలు వారికి అందుబాటులోని వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఫిర్యాదులు  గడువులోగా పరిష్కరించని సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయ సిబ్బంది సక్రమంగా స్పందించకున్నా, ఫిర్యాదులు తీసుకోకున్నా నగరపాలక సంస్థ కాల్‌ సెంటర్‌ 0863-2345103కు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు, ఎస్‌ఈ డి.శ్రీనివాస్‌, సిటీ ప్లానర్‌ బి.సత్యనారాయణ, డాక్టర్‌ వెంకటరమణ, బయాలజిస్ట్‌ ఓబులు తదితరులు పాల్గొన్నారు. 

ఆర్‌యూబీ, ఆర్‌వోబీల నిర్మాణానికి చర్యలు 

గరంలో పెండింగ్‌లో ఉన్న శ్యామలానగర్‌ రైల్వేఅండర్‌ బ్రిడ్జి, సంజీవయ్యనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాలకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ అన్నారు. శుక్రవారం కౌన్సిల్‌ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, సంజీవయ్యనగర్‌ గేట్ల వద్ద తాగునీటి పైప్‌లైన్‌ క్రాసింగ్‌ కోసం రైల్వే అధికారులకు ప్రతిపాదలను పంపామన్నారు. వాటిని ఆమోదించి క్రాసింగ్‌కి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ అరండల్‌పేట ఆర్‌వోబీ నిర్మించి 64ఏళ్లు గడిచిందని, ట్రాఫిక్‌ పెరిగినందున కొత్త ఆర్‌వోబీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు, ఎస్‌ఈ డి.శ్రీనివాస్‌, ఈఈలు శాంతిరాజు, కొండారెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈఈ  నాగిరెడ్డి, వర్చువల్‌గా డివిజనల్‌ రైల్వే ఇంజినీర్‌ ప్రతాప్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T05:47:22+05:30 IST