Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 14 2021 @ 06:04AM

కరోనా థర్డ్‌వేవ్ గురించి బీహెచ్‌యూ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే...

వారణాసి: కరోనా థర్డ్ వేవ్ రాబోతున్నదన్న అంచనాలు, మరోవైపు కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల మధ్య యూపీలోని బెనారస్ హిందూ యూనివర్శిటీ(బీహెచ్‌యూ) శాస్త్రవేత్తలు ఉపశమనం కలిగించే విషయాన్ని తెలియజేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కరోనా థర్డ్ వేవ్ కనీసం మూడు నెలల అనంతరం రానుంది. 

దేశంలో ముమ్మరంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ కరోనా థర్డ్‌వేవ్‌ను కొంతమేరకు అడ్డుకుంటుందని తెలిపారు. టీకా తీసుకున్నవారు ప్రొటెక్టివ్ గ్రూప్‌గా తయారై, వైరస్ నుంచి రక్షణ పొందుతారని పేర్కొన్నారు. మొదటి, రెండవ వేవ్‌ను పరిగణలోకి తీసుకుని చూస్తే, థర్డ్‌వేవ్ అంత ప్రమాదకరంగా పరిణమించదు. కరోనా వైరస్ గురించి అధ్యయనం చేస్తున్న బీహెచ్‌యూ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్ చౌబె మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ మరో మూడు నెలల తరువాత వస్తుందని, అది అంత ప్రమాదకరంగా ఉండదనే అంచనాలున్నాయన్నారు. వ్యాక్సినేషన్ వలన కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయినా, మరణాలను తగ్గించగలమన్నారు.

Advertisement
Advertisement