వారంలో మూడింతలు పెరిగిన కరోనా కేసులు... లాక్ డౌన్ ఉన్నప్పటికీ...

ABN , First Publish Date - 2020-03-29T12:56:53+05:30 IST

దేశంలో లాక్ డౌన్ ప్రారంభం అయిన తరువాత కూడా కరోనా వ్యాప్తి వేగం తగ్గడంలేదు. శనివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.45 గంటల మధ్య 194 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం నాటి...

వారంలో మూడింతలు పెరిగిన కరోనా కేసులు... లాక్ డౌన్ ఉన్నప్పటికీ...

న్యూఢిల్లీ: దేశంలో లాక్ డౌన్ ప్రారంభం అయిన తరువాత కూడా కరోనా వ్యాప్తి వేగం తగ్గడంలేదు. శనివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.45 గంటల మధ్య 194 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం నాటి గణాంకాలను పరిశీలిస్తే సంక్రమణ కేసుల సంఖ్య ఏడు రోజుల్లో మూడింతలు పెరిగింది. కాగా ఈ అంటువ్యాధికి సంబంధించి దేశవ్యాప్తంగా వైద్యులకు ఆన్‌లైన్ లో  శిక్షణ ఇస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లూవ్ అగర్వాల్ తెలిపారు. వైద్యులు అవసరమైన  నిరంతరం ఎయిమ్స్ వైద్యుల నుండి వీడియో కాల్‌లో సహాయం పొందవచ్చని తెలిపారు. ఐసిఎంఆర్ సీనియర్ అధికారి రామన్ గంగాఖేద్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం జంతువులపై కొన్ని కరోనా వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లూవ్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ వ్యాధి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించిందని అన్నారు. వివిధ రాష్ట్రాలలో  కరోనా సోకిన వ్యక్తుల సంబంధీకులను గుర్తించే పని వేగంగా జరుగుతున్నదన్నారు.


Updated Date - 2020-03-29T12:56:53+05:30 IST