బొబ్బిలిలో హైపోక్లోరైట్‌ పిచికారీ

ABN , First Publish Date - 2020-04-03T11:18:38+05:30 IST

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా గురువారం పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

బొబ్బిలిలో హైపోక్లోరైట్‌ పిచికారీ

బొబ్బిలి, ఏప్రిల్‌ 2: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా గురువారం పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఇందు కోసం ప్రత్యేక వాహనాన్ని వినియోగించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు,  మునిసిపల్‌ కమిషనర్‌ ఎంఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.   అనంతరం కమిషనర్‌కు శానిటైజర్‌ సీసాలను ఎమ్మెల్యే అందజేశారు. ప్రజలంతా వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రత  పాటించాలని,   మరో 12 రోజుల పాటు  అధికార యంత్రాంగానికి సహకరించి ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు.


భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు. వైసీపీ నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, తూముల భాస్కరరావు తదతరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో  వేరొక చోటకు మార్చిన కూరగాయల మార్కెట్‌ను కమిషనర్‌ పరిశీలించి వినియోగదారులకు కరోనాపై అవగాహన కల్పించారు. 

 

విరాళాల వెల్లువ

సీఎం సహాయనిధికి పలువురు విరాళాలు అందించారు.  గురువారం పట్టణానికి చెందిన పలువురు వర్తకులు తమ విరాళాలను ఎమ్మెల్యే శంబంగికి అందజేశారు. ఇంతవరకు సుమారు రూ.9 లక్షల మేర విరా ళాలు తనకు అందాయని ఎమ్మెల్యే తెలిపారు. సామాజిక కార్యకర్త , సీనియర్‌ ఉపాధ్యాయుడు తెంటు సత్యంనాయుడు రూ.లక్ష , వ్యాపారులు రెడ్డి సత్యం రూ.56,789, కొత్తా రవి, బరాటం గురుమూర్తి, కొత్తా రాజాలు రూ.50 వేల చొప్పున, గునాన శ్రీరామ్మూర్తి, గ్రంధి బాబు, వట్లూరి నరేశ్‌, సావు మురళి, మరిపి వేణు రూ.25 వేల చొప్పున, పూసర్ల గున్నేశ్వరరావు, చెలికాని మురళి రూ.20 వేలు చొప్పున, తెంటు పార్వతి, నల్ల నాగభూషణ రూ. 10 వేల  వంతను, ఇంకా రూ.ఐదువేల  చొప్పున అనేక మంది విరా ళాలను అందజేసినట్లు ఆయన తెలిపారు.


విమర్శలు తగవు 

ప్రభుత్వ అనుసరిస్తున్న కరోనా నియంత్రణ చర్యలను తప్పుబడుతూ మాజీ మంత్రి  సుజయ్‌కృష్ణరంగారావు  విమర్శలు చేయడం తగదని  ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై అధికారులతో పాటు, సామాజిక కార్యకర్తలు ఎంతగానో పోరు సాగిస్తున్న తరుణంలో ప్రజల ఆత్మస్దైర్యాన్ని దెబ్బతీసే విధంగా విమర్శలు చేయడం సరికాదన్నారు.  సేవలందించకుండా  ఇతరులపై బురదజల్లడం దేనికని ప్రశ్నించారు. ఈ సమయంలో మంచి సూచనలు, సలహాలు అందిస్తే స్వీక రించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు  శంబంగి వేణుగోపాలనాయుడు, ఇంటి గోపాలరావు, తూముల భాస్కరరావు, సావు కృష్ణమూర్తి, మరిశర్ల రామారావునాయుడు, తెంటు పార్వతి తదితరులు పాల్గొన్నారు.


 కారుణ్యఫౌండేషన్‌ సేవలు

 స్థానిక కారుణ్య ఫౌండేషన్‌ చైర్మన్‌ జేసీ రాజు  అధికార యం త్రాంగానికి అండగా నిలుస్తూ నిత్యం అనేక సేవాకార్య క్రమాలు చేపడు తున్నారు. ఇందులోని భాగంగా స్థానిక రాజాకళాశాల గ్రౌండ్స్‌లో   కూరగాయల మార్కెట్‌కు వచ్చే వ్యాపారులకు, కొనుగోలు దారులకు, నిరక్షరాస్యులకు మాస్క్‌లను అందించి, కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - 2020-04-03T11:18:38+05:30 IST