Abn logo
Mar 22 2020 @ 09:39AM

వెయ్యిమంది అతిధులతో కుమార్తె వివాహం...వధువు తండ్రిపై పోలీసు కేసు

అల్లప్పుజా (కేరళ): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించి వెయ్యిమంది అతిధులతో ఆర్భాటంగా తన కుమార్తె వివాహం చేసిన తండ్రిపై అల్లప్పుజా నార్త్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళ రాష్ట్రంలోని అల్లప్పుజా నగరంలోని అరాట్టువాజీ ప్రాంతానికి చెందిన షమీర్ అహ్మద్ తన కుమార్తెకు టౌన్ హాలులో వెయ్యిమంది అతిధులతో ఘనంగా వివాహం చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించి వివాహ వేడుక జరిపిన షమీర్ అహ్మద్ పై ఐపీసీ సెక్షన్ 269, 188, 118(ఈ) కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశామని సర్కిల్ ఇన్‌స్పెక్టరు వినోద్ కేపీ చెప్పారు. ఈ వివాహానికి 60 మందితోనే చేయాలని తహసీల్దారు ఆదేశాలు జారీ చేసినా దాన్ని షమీర్ అహ్మద్ ఉల్లంఘించి ఘనంగా వేడుక జరిపారు. తహసీల్దారు ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement