Abn logo
Apr 9 2020 @ 19:25PM

వీర విహారం చేస్తున్న కరోనా

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వీర విహారం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 15,23,898 కేసులు నమోదయ్యాయి. గురువారం సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా 5,938 కేసులను పాజిటివ్ కేసులుగా ప్రకటించారు. అలాగే ఈ రోజు కరోనా మహమ్మారి వల్ల 501 మంది మరణించారు. ప్రపంచం వ్యాప్తంగా ఇప్పటి వరకు 88,956 మందిని ఈ రక్కసి బలికొంది. 


దేశంలో ఇప్పటి వరకు 5,734 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, దేశంలో 24 గంటల్లో 17 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు 166 మంది మృతి చెందారని చెప్పారు. రాష్ట్రాలకు పీపీఈ కిట్స్‌, వెంటిలేటర్లు పంపుతున్నామని, 1.54 కోట్ల పీపీఈ కిట్లకు ఆర్డర్‌ చేశామని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement