మెట్రోలో విచిత్ర వేషధారణలతో ప్రయాణికులు... తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2020-10-12T15:00:14+05:30 IST

కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఈ నేపధ్యంలోనే మెట్రో ప్రయాణికులు తమకు కరోనా సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవి చూపరులకు ఎంతో విచిత్రంగా కనిపిస్తున్నాయి. కొంతమంది...

మెట్రోలో విచిత్ర వేషధారణలతో ప్రయాణికులు... తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు!

న్యూఢిల్లీ: కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఈ నేపధ్యంలోనే మెట్రో ప్రయాణికులు తమకు కరోనా సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవి చూపరులకు ఎంతో విచిత్రంగా కనిపిస్తున్నాయి. కొంతమంది కరోనానుంచి తమను తాము రక్షించుకునేందుకు మాస్కులకు మించిన రీతిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 



మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరి ఫొటోలను సబ్ వే క్రియేటర్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలలో కొంతమంది వాటర్ బాటిళ్లను మాస్కులుగా ఉపయోగిస్తుండగా, కొందరు సర్జికల్ మాస్కులను వినియోగిస్తున్నారు. కాగా కళ్ల నుంచి కూడా కరోనా వ్యాపిస్తుందనే వాదన వినిపిస్తున్నందున కొందరు ముఖమంతా పూర్తిగా కవరయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2020-10-12T15:00:14+05:30 IST