లాక్‌డౌన్ సమయంలో ప్రజలు రేడియో వింటున్నారు...

ABN , First Publish Date - 2020-04-10T19:12:14+05:30 IST

దేశంలో లాక్ డౌన్ సమయంలో రేడియో శ్రోతల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.....

లాక్‌డౌన్ సమయంలో ప్రజలు రేడియో వింటున్నారు...

మెట్రోనగరాల్లో 82 శాతం మంది రేడియో వింటున్నారు...సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో లాక్ డౌన్ సమయంలో రేడియో శ్రోతల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దేశంలో కరోనా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో మెట్రో నగరాల్లోని ప్రజలు 82 శాతం మంది రేడియోలు వింటున్నారని ఏజడ్ రీసెర్చ్ పార్ట్ నర్స్ ప్రైవేటు లిమిటెడ్ మార్కెటింగ్ కన్సల్టింగ్ సంస్థ జరిపిన సర్వేలో తేలింది. హైదరాబాద్ నగరంతోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, పూణే నగరాల్లోని 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల వారిలో 82 శాతం మంది రేడియో వింటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. రేడియోపై ప్రజల్లో విశ్వసనీయత ఉండటంతో 51 మిలియన్ల మంది రేడియో వింటున్నారని తేలింది. లాక్ డౌన్ సమయంలో రేడియో శ్రోతల సంఖ్య 64 శాతం నుంచి 82 శాతనికి పెరిగింది.


శ్రోతలకు కీలకమైన నిజమైన సమాచారం అందించడం వల్ల రేడియో శ్రోతల సంఖ్య పెరిగిందని హెచ్‌టి మీడియా లిమిటెడ్ నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్‌లో రేడియో అండ్ ఎంటర్టైన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హర్షద్ జైన్ చెప్పారు. ‘‘ప్రజలు ఇప్పుడు వారి రోజువారీ వినోద అవసరాలు, విశ్వసనీయ సమాచారం కోసం రేడియో సెట్‌లను గతంలో కంటే ఎక్కువ మంది ట్యూన్ చేస్తున్నారు. దేశం మొత్తం లాక్డౌన్లో ఉండటంతో, శ్రోతల సంఖ్య ఇంటిలోనే వింటున్నారు’’అని జైన్ వివరించారు.

Updated Date - 2020-04-10T19:12:14+05:30 IST