ఆ ప్రాంతాల్లోనివారు బయటకు వస్తే రూ. 5 లక్షలు కట్టాల్సిందే !

ABN , First Publish Date - 2020-04-05T15:18:42+05:30 IST

యూపీలోని కాన్పూర్‌లో కరోనా కదలికలు కనిపించిన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాలన్నింటినీ బారికేడింగ్ తో మూసివేశారు.

ఆ ప్రాంతాల్లోనివారు బయటకు వస్తే రూ. 5 లక్షలు కట్టాల్సిందే !

కాన్పూర్‌: యూపీలోని కాన్పూర్‌లో కరోనా కదలికలు కనిపించిన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాలన్నింటినీ  బారికేడింగ్ తో మూసివేశారు. డ్రోన్‌లతో పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో గుంపులుగా తిరిగే వారిపై కేసులు నమోదు  చేశారు. అన్వర్‌గంజ్, బెకాగంజ్, చమన్‌గంజ్, బాబుపూర్వా, కర్రాల్‌గంజ్, ఘటంపూర్‌లను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు డిఐజి అనంత్ దేవ్ తెలిపారు. ఈ ప్రాంతంలోని మసీదులు ఎక్కువగా ఉన్నాయి. కరోనా సోకిన వారు  మసీదులకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా, ఈ ప్రాంతాలను సీల్  చేశారు. ఈ నేపథ్యంలో బెక్‌గంజ్‌లో డ్రోన్‌ల నిఘాలో 9 మంది కనిపించారు. వారిని పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిన వీరందరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

Updated Date - 2020-04-05T15:18:42+05:30 IST