కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డీజీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-04-02T12:14:32+05:30 IST

కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సంచలన వ్యాఖ్యలు....

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డీజీ సంచలన వ్యాఖ్యలు

 రాబోయే కొద్దిరోజుల్లో 10 లక్షల కరోనా కేసులు.. 

జెనీవా : ప్రపంచవ్యాప్తంగా 205 దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడచిన ఐదు వారాల్లో కరోనా కేసుల పెరుగుదల గణనీయంగా ఉందని, మరణాల సంఖ్య కూడా రెట్టింపు అయిందని టెడ్రోస్ అధనామ్ జెనీవాలో జరిగిన సమావేశంలో చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 10లక్షల కరోనా కేసులు బయటపడతాయని, కరోనా మరణాల సంఖ్య 50వేలకు చేరుకుంటుందని టెడ్రోస్ చెప్పారు.


చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ ఆ దేశంలో తగ్గుతున్నా, ప్రపంచవ్యాప్తంగా 205 దేశాల్లో వేగంగా పెరగడంపై టుడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం, దగ్గు, ఇతర కరోనా లక్షణాలున్న వ్యక్తులతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని, వారిని పట్టుకోవడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ వల్ల నిరుపేదలు రోజువారీ రొట్టె కోసం అవస్థలు పడాల్సి వస్తుందని, అలాంటి వారికి అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని కోరారు.

Updated Date - 2020-04-02T12:14:32+05:30 IST