లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-04-02T09:45:34+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజకుమారి హెచ్చ రించారు.

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

 ఎస్పీ రాజకుమారి

నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటన


విజయనగరం క్రైమ్‌, ఏప్రిల్‌ 1: కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని  ఎస్పీ రాజకుమారి హెచ్చ రించారు. నగరంలోని రైతుబజార్లు, మార్కెట్‌ ప్రాం తాలు, ప్రధాన కూడళ్లను బుధవారం ఆమె సంద ర్శించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా ఝుళిపించారు. ద్విచక్రవాహనాలపై ఒక్కరికంటే ఎక్కువ వచ్చినవారిపై, ఆటోలో ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణించేందుకు అనుమతించిన ఆటోడ్రై వర్లపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు, చేతిరుమాళ్లు ధరించాలన్నారు. అత్యవసర పరిస్థితి మినహా ఎవరూ బయటకు రావద్దన్నారు.


ఇప్పటికే లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన  259 మందిపై 124 కేసులు నమోదు చేశామని తెలిపారు. మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారిపై 8,984 కేసులు నమోదు చేశామని, 39 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, రూ.47లక్షలు అపరాధ రుసుం విధిం చామని తెలిపారు. కరోనా వైరస్‌ అను మానితుల సంఖ్య రోజురోజుకూ పెరు గుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సహకరిం చాలని కోరారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ జె.రామ్మోహనరావు, డీఎస్పీలు వీరాం జనేయరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, ఎల్‌. మోహనరావు, ఎల్‌.శేషాద్రి, సీఐలు ఎర్రంనాయుడు, డి.శ్రీహరిరాజు, డి.లక్ష్మ ణరావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


డీజీపీకి కృతజ్ఞతలు

పోలీసు కుటుంబాల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినందుకు గాను రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం గౌరవ ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస రావు, జిల్లా పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు బుధవారం కృత జ్ఞతలు తెలిపారు.  కరోనా మహ మ్మారిని పారద్రోలడానికి పోలీసులు చేస్తున్న కృషిని గమనించి వారి కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కారానికి హెల్ప్‌ డెస్క్‌ దోహదపడుతుందన్నారు. 55 ఏళ్లు పైబ డిన పోలీసులకు జిల్లా కేంద్రంలోనే విధులు,  మాస్క్‌లు, గ్లౌజులు పంపిణీ అభినందనీయమని తెలిపారు. 

Updated Date - 2020-04-02T09:45:34+05:30 IST