కరోనా బాధితుడు వివాహ వేడుకలో పాల్గొన్నవేళ...

ABN , First Publish Date - 2020-06-04T18:17:50+05:30 IST

హోంక్వారంటైన్‌లో ఉండాల్సిన కరోనా బాధితుడు నిబంధనలు ఉల్లంఘించి వివాహ వేడుకలో పాల్గొన్న ఉదంతం మహారాష్ట్రలోని జాల్నా నగరంలోని క్రాంతినగర్ లో వెలుగుచూసింది.....

కరోనా బాధితుడు వివాహ వేడుకలో పాల్గొన్నవేళ...

జాల్నా(మహారాష్ట్ర): హోంక్వారంటైన్‌లో ఉండాల్సిన కరోనా బాధితుడు నిబంధనలు ఉల్లంఘించి వివాహ వేడుకలో పాల్గొన్న ఉదంతం మహారాష్ట్రలోని జాల్నా నగరంలోని క్రాంతినగర్ లో వెలుగుచూసింది. జాల్నా నగరంలోని సదర్ బజార్ ప్రాంతానికి చెందిన ఓ ఉద్యోగితోపాటు అతని కుటుంబానికి ఆసుపత్రిలో జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితోపాటు కుటుంబసభ్యుల చేతులపై స్టాంపు వేసి హోం క్వారంటైన్ కు తరలించారు. కరోనా బాధితుడు హోంక్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించి క్రాంతినగర్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నాడు. చేతిపై ఉన్న హోంక్వారంటైన్ ముద్రను చూసిన అతిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిబంధనలు ఉల్లంఘించిన కరోనా రోగిపై కేసు నమోదు చేశారు. కరోనా రోగి వివాహ వేడుకలో ఎవరెవరిని కలిశారో గుర్తించే పనిలో ఆరోగ్యకార్యకర్తలు మునిగారు. 

Updated Date - 2020-06-04T18:17:50+05:30 IST