దేశంలో 7 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో క‌రోనా బాధితులు

ABN , First Publish Date - 2020-07-06T16:06:54+05:30 IST

దేశంలో కరోనా రోగుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. గడ‌చిన 24 గంటల్లో దేశంలో 24 వేల, 248 కొత్త క‌రోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో 7 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో క‌రోనా బాధితులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోగుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. గడ‌చిన 24 గంటల్లో దేశంలో 24 వేల, 248 కొత్త క‌రోనా కేసులు నమోదయ్యాయి. 425 మంది మృతి చెందారు. ఆరోగ్యమంత్రిత్వశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన వివ‌రాల‌ ప్రకారం దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం రోగుల సంఖ్య 6 లక్షల 97 వేల 413. వీరిలో 19 వేల 693 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఇప్పటివరకు 4 లక్షల 24 వేల 433 మంది కోలుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపిన‌ ప్రకారం జూలై 5 వరకు మొత్తం 99 లక్షల 69 వేల 662 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కాగా క‌రోనా కేసుల విష‌యంలో భారత్ రష్యాను దాటింది. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య‌ 2 లక్షలు దాటింది. త‌మిళనాడులో క‌రోనా బాధితుల‌ సంఖ్య ఒక లక్షా 11 వేలు దాటింది. దేశ రాజధానిలో కరోనా రోగులు లక్షకు చేరుకున్నారు. 

Updated Date - 2020-07-06T16:06:54+05:30 IST