దేశంలో 7 నగరాల్లోనే యాభై శాతం కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-13T18:32:35+05:30 IST

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోనే యాభైశాతం కరోనా కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది....

దేశంలో 7 నగరాల్లోనే యాభై శాతం కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోనే యాభైశాతం కరోనా కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  3,08,993 కరోనా కేసులతో భారతదేశం ప్రపంచంలో 4వస్థానానికి చేరింది. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 32 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే వెలుగుచూశాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో 45 శాతం కేసులు నమోదైనాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణే, థానే నగరాలతోపాటు ఢిల్లీ, అహ్మదాబాద్(గుజరాత్), చెన్నై (తమిళనాడు), జైపూర్ (రాజస్థాన్), ఇండోర్ (మధ్యప్రదేశ్) నగరాల్లో అధికంగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 55, 451 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో 36,824కేసులు నమోదు కాగా, వీరిలో 1214 మంది మరణించారు.చెన్నై నగరంలో 27వేల మందికి కరోనా సోకింది. థానేలో 16వేల మందికి కరోనా రాగా, 400 మంది మరణించారు. అహ్మదాబాద్ నగరంలో 16వేల కేసులు బయటపడ్డాయి. పూణేలో 11వేల కేసులు నమోదు కాగా, 459 మంది మరణించారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో 4వేల మందికి కరోనా వచ్చింది. 

Updated Date - 2020-06-13T18:32:35+05:30 IST