పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డీజీపీ

ABN , First Publish Date - 2020-05-31T08:06:49+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ పోలీసులు పలు అంక్షలు అమల్లోకి తెచ్చారు. మాస్క్‌ లేకుండా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు....

పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డీజీపీ

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ పోలీసులు పలు అంక్షలు అమల్లోకి తెచ్చారు. మాస్క్‌ లేకుండా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు భౌతిక దూరం పాటించని వారిని ఏఐ టెక్నాలజీతో గుర్తిస్తునారు. వైరస్‌ కట్టడిలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపైనా నిషేధం ఉండటంతో నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తున్నవారిపై రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదును ముమ్మరం చేశారు. కాగా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. అంతిమంగా పరిసరాల నుంచి లబ్ధి పొందేది మనమేనన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాల్ని తన ట్వీట్‌కు ఆయన జోడించారు.

Updated Date - 2020-05-31T08:06:49+05:30 IST